బీఆర్ఎస్ ఎంపీలకు గులాబీ బాస్ క్లాస్..?

తెలంగాణ సీఎం కేసీఆర్ తన పార్టీని జాతీయ పార్టీగా మార్చిన దగ్గరి నుంచి.స్పీడ్ పెంచారు.

 Gulabi Boss Class For Brs Mps, Cm Kcr, Brs Mps, Central Budget Sessions, Bjp Pol-TeluguStop.com

దేశంలోని ప్రతీ రాస్ట్రంలోని పెద్ద నేతలను టార్గెట్ గా పావులు కదుపుతూ ఉన్నారు.గుజరాత్ నుంచి మొదలు పెడితే.

ఒడిశా దాకా మాజీ ముఖ్యమంత్రులను, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేసీ.పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నారు.

జాతీయ స్థాయిలో ఎలాగైనా గుర్తింపు తెచ్చుకోవడానికి.రైతు వింగ్ ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఇక బీఆర్ఎస్ ఒక్కో రాష్ట్రంలో నేతలకు కండువాలు కప్పుతున్నా.బీజేపీ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతోంది.

రాష్ట్రంలో మెల్లిగా బలపడుతోన్న బీజేపీని ఎలాగైనా ఇరుకున పెట్టాలని సీఎం కేసీఆర్ ఏకంగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసును తెరమీదకు తీసుకుని వచ్చారు.అయితే అది అనుకున్న స్థాయిలో పని చేయలేదు .దాంతో ఢిల్లీ గడ్డ నుంచే.బీజేపీపై వార్ డిక్లేర్ చేయాలని గులాబీ బాస్ ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది.

దాని కోసం, ఎంపీలందరినీ పిలిచి క్లాస్ తీసుకోనున్నారు.రాబోయే బడ్జెట్ సమావేశాల్లో బీజేపీని ఏఏ అంశాల మీద నిలదీయాలి అనే దాని గురించి వివరించనున్నారు.

Telugu Bjp, Brs Mps, Brs, Central Budget, Cm Kcr, Mlas-Politics

బడ్జెట్లో ఎలాగో, ఏపీ తెలంగాణాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎన్నికల్లో విజయావకాశాలు ఉండే రాష్ట్రాలపై వరాల జల్లు కురిపించే చాన్స్ ఉంది.దాన్ని పావుగా చేసుకుని.ఇటు రాష్ట్రంలోనూ, అటు బీఆర్ఎస్ జెండా ఉన్న రాష్ట్రాలలోనూ బీజేపీని ఇరుకున పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు.ఇందులో భాగంగా తెలంగాణా ఎంపీలకు బీజేపీని ఇబ్బంది పెట్టేలా ప్రశ్నలు అడగాలని సూచించనున్నారు.

తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వకపోతే.ఇటు రాష్ట్రంలో తన వ్యూహాన్ని అమలు చేయడానికి కేసీఆర్ సన్నద్ధం అవుతున్నారు.

Telugu Bjp, Brs Mps, Brs, Central Budget, Cm Kcr, Mlas-Politics

ఈ సారి బడ్జెట్ సమావేశాల్లో దేశం మొత్తం తెలంగాణ ఎంపీలను చూసేలా చేయడానికి కూడా కేసీఆర్ స్క్రిప్టు రెడీ చేస్తున్నట్టు ఊహాగానాలు మొదలు అయ్యాయి.సభ లోపలా బయటా నానా రబసా చేసైనా సరే.దేశం దృష్టిని ఆకర్షించాలని గులాబీ బాస్ ఎంపీలకు దిశా నిర్దేశం చేసే చాన్స్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube