మెట్రో నగరాల్లో ఎత్తైన అపార్టుమెంట్లలో నివసించేవారు అప్పుడప్పుడు కొన్ని రకాల అగ్ని ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి వుంది.అయితే ఇలాంటి వారికి గుజరాత్.
వల్సాద్‌లోని ఒక ప్రాథమిక పాఠశాలలో ఓ విద్యార్థి, ఉపాధ్యాయుడు అభివృద్ధి చేసిన ప్రత్యేకమైన లైఫ్ సేవింగ్ విండో సిస్టమ్ అనేది బాగా ఉపయోగపడుతుంది.అగ్ని ప్రమాదాలు సంభవించినపుడు ప్రాణనష్టాలను నివారించడానికి అది ఉపయోగపడుతుంది.
ఈ లైఫ్ సేవింగ్ విండో.భవిష్యత్తులో ఎత్తైన భవనాలలో ఫైర్ సేఫ్టీ సిస్టమ్‌తో పాటు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు.

కాగా వారు చేసిన ఐడియా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి గణిత సైన్స్ ఫెయిర్‌లో ఎంపికకావడం గమనార్హం.అంతేకాకుండా తాజాగా జాతీయ స్థాయికి కూడా ఎంపిక కావడంతో ఆ పాఠశాల పేరు ఇపుడు దేశమంతటా మారుమోగిపోయింది.వివరాల్లోకి వెళితే, వల్సాద్ జిల్లా. పార్డి తాలూకా.చిన్న ఖెర్లావ్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది.ఇందులో చదువుతున్న జయన్స్ మనీష్‌భాయ్ పటేల్ అనే విద్యార్థి, పాఠశాల గణిత ఉపాధ్యాయుడు చేతన్ పటేల్ ఒక అద్భుతమైన ఆలోచన చేసి కాన్సెప్ట్‌ను సృష్టించారు.
ఆ పిదప రాష్ట్రంలో విద్యాశాఖ నిర్వహించిన గణితశాస్త్ర విజ్ఞాన ప్రదర్శనలలో ఈ పనిని ప్రదర్శించారు.

ఈ కాన్సెప్ట్‌ని లైఫ్ సేవింగ్ విండో అంటారు.ఈ లైఫ్ సేవింగ్ విండో ప్రాజెక్ట్ ద్వారా అగ్ని ప్రమాదాల నుంచి తమను తాము రక్షించుకోవచ్చు.నామమాత్రపు ఖర్చుతో భవనాల్లో ఈ లైఫ్ సేవింగ్ విండో ఏర్పాటు చేసుకోవచ్చు.
ఇది సెన్సార్‌కి కనెక్ట్ అయి ఉంటుంది.దాంతో భవనంలో మంటలు సంభవించినప్పుడు ఈ సెన్సార్ పనిచేస్తుంది.
వెంటనే విండో కాస్తా.నిచ్చెన ఆకారంలోకి మారిపోతుంది.
భవనాల్లో చిక్కుకున్న వారు ఈ కిటికీ ద్వారా బయటకు వచ్చి తమ ప్రాణాలను కాపాడుకోవచ్చు.అలా అగ్ని ప్రమాదాల సమయంలో ఇది చాలా ముఖ్యమైనదిగా గుర్తింపు పొందుతోంది ఇపుడు.







