విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త,రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ శ్రీ కె కె రాజు గారు ఈరోజు గురువారం గ్రీవెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా నియోజకవర్గం నుండి పలువురు కార్యాలయంకు విచ్చేసి తమ సమస్యలను శ్రీ కె కె రాజు గారికి స్వయంగా విన్నవించారు.
వారి వద్ద నుండి సంబంధిత వినతి పత్రాలు, దరఖాస్తులు తీసుకుని అధికారులతో మాట్లాడి కొన్ని వెంటనే పరిష్కరించారు.మరికొన్ని సంబంధిత అధికారులకు రిఫర్ చేసి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో 14,43 వార్డులు కార్పొరేటర్లు కె.అనిల్ కుమార్ రాజు,పి.ఉషశ్రీ,మాజీ కార్పొరేటర్ బాక్సర్ రాజు,నీలి రవి,ఆళ్ల శివ గణేష్,కిరణ్ రాజు,రాజం రాజు,వసంతల అప్పారావు, సుకుమార్,జ్ఞానేశ్,యం.గోపి,సునీల్,కోడూరి సుశీల,పావని,సీనియర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.







