చిన్న పచ్చిమిర్చి ముక్క పాప ప్రాణాలకే ప్రమాదం తెచ్చింది.ఎలా అంటే ?

చిన్న పిల్లలకు ఒక వయసు వచ్చే వరకు ఆహారంలో ఏం పెట్టాలో వైద్యులను సంప్రదించి పెట్టాలి.

పిల్లల విషయంలో చిన్న చిన్న పొరపాట్లే ఒక్కోసారి ప్రాణాలకు కూడా హాని కలిగించవచ్చు.

చిన్న పిల్లలు మనలాగా ఏది పడితే అది తినలేరు.వాళ్లకు అన్ని చూసుకుని పెట్టాలి.

ఫుడ్ మెత్తగా వండి మాత్రమే పెట్టాలి.ఇలాంటి చిన్న జాగ్రత్తలు కూడా తీసుకోక పోతే పిల్లల ప్రాణాలకే ముప్పు రావచ్చు.

తాజాగా జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చర్య పోతారు.చిన్నారి పాప విషయంలో ఈ తల్లిదండ్రులు చేసిన చిన్న పొరపాటు కారణంగా ఆ పాప ప్రాణాలు కోల్పోయేది.

Advertisement
Green Chili Stuck In The Trachea Of A 13 Month Old Baby, Piece Of Green Chili, 1

వెంటనే స్పందించి ఆసుపత్రికి వెళ్లారు కాబట్టి ఈ రోజు ఆ పాప వాళ్ళ కళ్ళ ముందు ఉంది.అసలు ఇంతకీ ఏం జరిగిందో తెలుసు కోవాలి అనుకుంటున్నారా వివరాల్లోకి వెళ్తే.

Green Chili Stuck In The Trachea Of A 13 Month Old Baby, Piece Of Green Chili, 1

ఈ ఘటన మధ్య ప్రదేశ్ లో జరిగింది.ఇక్కడ హాస్పిటల్ లో డాక్టర్లు అరుదైన కేసును డీల్ చేసి 13 నెలల చిన్నారిని ప్రాణాలతో కాపాడారు.ఈ పాప పేరు షయానా.

ఎందుకో గత కొన్ని రోజులుగా ఏడుస్తూనే ఉంది తల్లిదండ్రులు ఎంత ఊరుకో బెట్టిన ఏడుపు ఆపడం లేదు.ఆ పాపకు ఏం జరిగిందో చెప్పే వయసు కూడా లేద .దీంతో తల్లిదండ్రులకు కూడా ఆ పాప భాధ అర్ధం కాలేదు.

Green Chili Stuck In The Trachea Of A 13 Month Old Baby, Piece Of Green Chili, 1

ఇంకా లాభం లేదని తల్లిదండ్రులు హాస్పిటల్ కు తీసుకు వెళ్లారు.అయితే డాక్టర్లు చెక్ చేసి షాకింగ్ విషయం చెప్పారు.పాప ఊపిరి పీల్చుకోవడానికి కష్టపడుతుందని డాక్టర్స్ చెప్పారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!

దీంతో డాక్టర్స్ వెంటనే ఎండోస్కోపీ చేయడంతో అసలు విషయం తెలిసింది.పాపకు ఊపిరితిత్తులకు వెళ్లే గొట్టంలో పచ్చిమిర్చి ముక్క ఒకటి ఇరుక్కుపోయిందని వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు.

Advertisement

వెంటనే పాపకు ఆపరేషన్ చేసి ప్రాణాలను కాపాడారు.డాక్టర్స్ అంత చిన్న పిల్లకు పచ్చిమిర్చి ఎందుకు పెట్టారు అని అడగగా పళ్ళు వచ్చాయి కదా అని పెట్టమని తల్లిదండ్రులు చెప్పారు.

వాళ్ళు చేసిన చిన్న నిర్లక్యం కారణంగా పాప ప్రాణాలతో పోరాడే వరకు వెళ్ళింది.అందుకే పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

తాజా వార్తలు