హైదరాబాద్: క్యాన్సర్ రోగులకు సహాయాన్ని అందించడంలో విశేష కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ .అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా ‘గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్’ను ఫిజికల్, వర్చువల్‌గా నిర్వహిస్తున్నది.
జూబ్లీహిల్స్‌లోని హోటల్ దసపల్లాలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ నటి, జంతు సంరక్షణ కార్యకర్త అమల అక్కినేని ముఖ్య అతిథిగా హాజరై గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ 2022 పోస్టర్‌ను ఆవిష్కరించారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న రన్నర్లను ఈ రన్‌లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు.
భయంకరమైన క్యాన్సర్ వ్యాధికి వ్యతిరేకంగా పోరాటంలో రన్నన్లరు భాగస్వాములు చేస్తున్నారు.క్యాన్సర్‌పై అవగాహన, నివారణ, ముందస్తుగా వ్యాధిని గుర్తించడంలో రన్నర్లు తమ స్పూర్తిని అందిచాలనే ఒక గొప్ప సదుద్దేశంతో ‘రన్ ది ఎక్స్‌ట్రా మైల్ టు గిఫ్ట్ ఏ స్మైల్’ అనే నేపథ్యంతో ఈ రన్‌ను నిర్వహిస్తున్నారు.
5 కి.మీ.10 కి.మీ., 21.1కి.మీ.(హాఫ్ మారథాన్) మూడు విభిన్న దూర విభాగాల్లో ఫిజికల్, వర్చువల్ అనే హైబ్రిడ్ పద్ధతిలో రన్ నిర్వహిస్తారు.ఫిజికల్ రన్ హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్, గుంటూరు, నిజామాబాద్, దావణగెరెతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరో 130 దేశాల్లోని నగరాల్లో జరుగుతుంది.వర్చువల్ రన్‌లో ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచైనా ఈ రన్‌లో పాల్గొనవచ్చు.రన్నర్లు ఉదయం 5.00 -9.00 గంటల మధ్య పరిగెత్తాల్సి ఉంటుంది.ఆసక్తిగల ఔత్సాహికులు ప్రపంచవ్యాప్తంగా వారి సంబంధిత టైమ్ జోన్‌లలో రన్ వివరాలను యాక్సెస్ చేయవచ్చు.https://gracecancerrun2022.iq301.com/లో పేర్లు నమోదు చేసుకోవచ్చు.
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో గౌరవ అతిథిగా రిటైర్డ్ ఐఏఎస్ అజయ్ మిశ్రా, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, సీఈవో డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి, రిటైర్డ్ ఐపీఎస్ సుజాత రావు, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపక ట్రస్టీ డాక్టర్ ప్రమీలారాణి, గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ 2022 రేస్ డైరెక్టర్ నిరంజన్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.