Ravikula Raghurama Review : రవికుల రఘురామ సినిమా రివ్యూ అండ్ రేటింగ్?

సినీ ఇండస్ట్రీలో ప్రేమ కథ సినిమాలు ఎన్నో వచ్చాయని చెప్పాలి.

ఇలా ప్రేమ కథ సినిమాలో ప్రేక్షకుల ముందుకు ఎన్ని వచ్చినా కూడా ప్రేక్షకుల ఆదరణ ఎప్పటికీ తగ్గదని చెప్పాలి.

అందమైన ప్రేమ కథ చిత్రాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎన్నో సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి అలాంటి గొప్ప ప్రేమ కథ చిత్రంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి వాటిలో రవికుల రఘురామ( Ravikula Raghurama ) ఒకటి.గౌతమ్ వర్మ, దీప్షికలు జంటగా.

చంద్రకాంత్ తీసిన ఈ సినిమా మార్చి 15న విడుదలైంది.శ్రీధర్ వర్మ నిర్మించిన ఈ చిత్రం ఆడియెన్స్‌ను ఏ మేరకు ఆకట్టుకుందో ఓ సారి చూద్దాం.

కథ:

గౌతమ్ (గౌతమ్ వర్మ)( Gowtham ) అనే వాడు కలియుగ రాముడి టైపు.ఇలాంటి అబ్బాయి.

Advertisement

నిషా (దీప్షిక ఉమాపతి)( Deepshika Umapathi ) అనే అమ్మాయిని చూడటం.ఆమె ప్రేమలో పడిపోతాడు.

ఇలా నిషా ప్రేమలో పడినటువంటి గౌతమ్ తనని ప్రేమిస్తున్నాడనే విషయం తెలిసి ఆమె కూడా తన ప్రేమలో పడుతుంది.ప్రేమ అన్న తర్వాత చాలా సినిమాలలో బ్రేకప్ జరిగి, కలుసుకున్నట్టు చూపించారు.

ఇక ఈ సినిమాలో కూడా నిషా, గౌతమ్ మధ్య కొన్ని కారణాలవల్ల భేదాభిప్రాయాలు వస్తాయి.ఈ భేదాభిప్రాయాలు కారణంగా వీరిద్దరూ తమ లవ్ కి బ్రేకప్ చెప్పుకుంటారు.

దీంతో నిషా( Nisha ) గౌతమ్ ని వదిలి వెళ్ళిపోతుంది అయితే వీరిద్దరూ ఎందుకు బ్రేకప్ చెప్పకున్నారు ఇద్దరి మధ్య ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి చివరికి వీళ్ళు కలుసుకున్నారా లేదా అన్నది ఈ సినిమా కథ.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

నటీనటుల నటన:

కలియుగ రాముడు అన్న పాత్రలో గౌతమ్ చాలా చక్కగా ఒదిగిపోయిన నటించారు.ఇక ఈయనకు ఇది మొదటి సినిమా అనే భావన లేకుండా హీరో హీరోయిన్లు ఇద్దరు కూడా ఈ సినిమాలో ఒదిగిపోయి నటించారు.ఎమోషనల్ సన్నివేశాలలో తన నటనతో ఇరగదీసాడని చెప్పాలి ప్రేమ కథ సినిమాలకు( Love Stories ) గౌతమ్ 100% సూట్ అవుతారు అనే విధంగా ఈ సినిమాలో నటించారు ఇక హీరోయిన్ దీప్షిక కూడా తన పాత్రకు వందశాతం న్యాయం చేస్తారు మిగిలిన నటీనటులు కూడా ఎంతో అద్భుతంగా నటించారని చెప్పాలి.

Advertisement

టెక్నికల్:

టెక్నికల్ విషయానికి వస్తే దర్శకుడు ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరపై చూపించే ప్రయత్నాలు చేశారు .ఇక సుకుమార్ పమ్మి సంగీతం, మురళీ కెమెరా వర్క్ బాగుంది.ప్రతి ఫ్రేమ్ ఫ్రెష్‌గా ఉండేలా జాగ్రత్త పడినట్టు తెరపైన కనిపిస్తోంది.

మొదటి ప్రాజెక్ట్ అయినా కూడా దర్శక నిర్మాతలు మంచి క్వాలిటీ అవుట్ పుట్‌ను బయటకు తీసుకొచ్చారు.నిర్మాణాత్మక విలువలు కూడా బాగున్నాయి.

విశ్లేషణ:

చంద్రశేఖర్ కానూరి( Chandrashekar kaanuri) కొత్త దర్శకుడు అయిన ప్రేమ కథ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు .అంతేకాకుండా ఈ ప్రేమ కథకు తల్లి సెంటిమెంట్( Mother Sentiment ) జోడించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఇక ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

అంతేకాకుండా ట్విస్టులతో కూడినటువంటి కొన్ని సన్నివేశాలు ఎమోషనల్ గా అందరిని ఆకట్టుకున్నాయి.ఇక ప్రేమ కథ సినిమాలు కావడంతో కాస్త స్లోగా వెళ్ళినట్టే అనిపించింది.

అంతేకాకుండా ఈ సినిమాలో అందరూ కొత్తవాళ్లు కావటం ఈ సినిమాకి చిన్న మైనస్ అని చెప్పాలి.

ప్లస్ పాయింట్స్:

హీరో హీరోయిన్ల నటన, ట్విస్టులు, మదర్ సెంటిమెంట్ తో ఎమోషనల్ సీన్స్.

మైనస్ పాయింట్స్:

కథ నెమ్మదిగా సాగటం, అక్కడక్కడ సన్నివేశాలు చూసిన అనుభూతి కలగడం.

బాటమ్ లైన్:

ఇలాంటి ప్రేమ కథతో కూడిన సినిమాలు ఎన్నో వచ్చాయి.కానీ ఎప్పుడు కూడా ప్రేమ కథ సినిమాలోకి కొత్త అనుభూతిని కలిగిస్తాయి ఇక ఈ సినిమా ఎమోషనల్ తో కూడిన ప్రేమ కథ చిత్రం గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది

రేటింగ్: 2.5/5

తాజా వార్తలు