తెలంగాణలో 111 జీవోపై ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.జీవో రద్దు వలన రాజకీయ నాయకులు, రియల్టర్లు లాభపడ్డారని తెలిపారు.
111 జీవో పరిధిలో జరిగిన భూ బదిలీలపై సర్కార్ శ్వేతపత్రం విడుదల చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు.రాష్ట్రాన్ని ఏ విధంగా అమ్మకానికి పెట్టాలో అని సోమేశ్ కుమార్ ఆలోచిస్తున్నారని ఆరోపించారు.111 జీవో పరిధిలోని భూముల అమ్మకాలు ఇప్పటికే 50 శాతం పూర్తయ్యాయని తెలిపారు.కేసీఆర్ కు ఆదాయం పొందాలనే ఆలోచన తప్ప మరొకటి లేదని విమర్శించారు.111 జీవో పరిధిలో 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్న ఆయన ఆరు నెలల్లో తెలంగాణను వీలైనంత అమ్మడమే కేసీఆర్ లక్ష్యమని మండిపడ్డారు.కేసీఆర్ కు మెమొరీ లాస్ స్టార్ట్ అయిందని ఎద్దేవా చేశారు.
దళితులు, బలహీన వర్గాలకు గతంలో కాంగ్రెస్ ఇచ్చిన భూములను లాక్కుని కేసీఆర్ అమ్మకానికి పెడుతున్నాడని విమర్శించారు.