అమెరికాలో తెలుగు యువతి సత్తా చాటింది.కంప్యూటర్ సైన్స్‌లో అత్యున్నత అవార్డుకు ఎంపికైంది.
అమెరికాలో హైస్కూల్ కంప్యూటింగ్‌లో అత్యున్నత పురస్కారంగా భావించే ‘‘ Cutler-Bell Prize ’’ అవార్డ్‌ను తెలుగు యువతి సిరిహాస నల్లమోతు సాధించింది.ఈమెతో పాటు మరో ముగ్గురు కూడా అవార్డ్‌కు ఎంపికయ్యారు.
వీరు బెల్, ఈలియాస్, గ్వాన్.ఇల్లినాయిస్‌లోని నార్మల్‌లో యూనివర్సిటీ హైస్కూల్‌లో చదువుకుంటున్న సిరిహాస నల్లమోతు( Sirihasa nallamothu ).చాతుర్యం, సంక్లిష్టత, ఔచిత్యం, వాస్తవికతల ఆధారంగా న్యాయమూర్తుల ప్యానెల్ ఎంపిక చేసిన తన ప్రాజెక్ట్‌కు 10,000 డాలర్ల నగదు బహుమతిని అందుకుంది.ఆధునిక సాంకేతికత, కంప్యూటర్ సైన్స్‌తో కలిసి ‘‘Vasovagal Syncope’’ ( పోస్చురల్ ఆర్థోస్టాటిక్ టాచీకార్డియా సిండ్రోమ్ (పీవోటీఎస్) వున్న రోగులలో హృదయ స్పందన రేటు, రక్తపోటులో ఆకస్మిక తగ్గుదల)ను అంచనా వేయడమే సిరిహాస ప్రాజెక్ట్.
సింకోప్‌ను అంచనా వేయడానికి పరిశోధన అధ్యయనాలు, పరిష్కారాలు లేవని గుర్తించిన సిరిహాస ఈ ప్రాజెక్ట్‌కు పూనుకుంది.

ఒక వార్తా కథనం ప్రకారం.ఇన్‌స్టిట్యూషనల్ రివ్యూ బోర్డ్ రీసెర్చ్ స్టడీని నిర్వహించడంతో పాటు వాస్తవ ప్రపంచంలో పీవోటీఎస్ రోగులపై హ్యూమన్ సబ్జెక్ట్ ఫీల్డ్ డేటాను సేకరించిన తొలి వ్యక్తి సిరిహాసానే అని తెలిపింది.హృదయ స్పందన రేటు, బ్లడ్ వాల్యుమెట్రిక్ ప్రెజర్, ఈడీఏ, ఉష్ణోగ్రత, యాక్సిలెరోమీటర్ డేటా యొక్క 15 నిమిషాల విండ్ సిగ్నల్ డేటాను సేకరించేందుకు గాను సిరిహాస పైథాన్ స్క్రిప్ట్‌ను రాసింది.
అంతేకాకుండా ఆమె తన స్కూల్‌లో ‘‘గర్ల్స్ హో కోడ్ క్లబ్’’ను కూడా స్థాపించింది.కోడింగ్ కరిక్యులమ్ , గ్రాంట్‌లు, ఫండింగ్ , నెట్‌వర్కింగ్, ప్రణాళికబద్ధమైన ఈవెంట్‌లను సిరిహాస నిర్వహించింది.
తన పరిశోధనను పూర్తి చేసిన తర్వాత.ఆమె దీనిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది.
ఇందుకోసం స్మార్ట్‌వాచ్‌తో తన అల్గారిథమ్‌ను అనుసంధానం చేయాలని యోచిస్తోంది.

ఇకపోతే.2015లో డేవిడ్ కట్లర్, గోర్డాన్ బెల్‌లు ఈ అవార్డ్‌ను నెలకొల్పారు.ఈ పురస్కారం కంప్యూటర్ సైన్స్ రంగాన్ని ప్రోత్సహిస్తుంది.
కట్లర్ డిజిటల్ ఎక్విప్‌మెంట్ కార్పోరేషన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.ఈయన ఎన్నో ఆపరేటింగ్ సిస్టమ్‌లకు డెవలపర్‌గా వ్యవహరించారు.
ఇక బెల్ విషయానికి వస్తే.ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీర్, మైక్రోసాఫ్ట్ రీసెర్చ్‌లో పరిశోధకుడు.







