ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవారికి చెక్.. వారిని నియంత్రించడానికి ఓ కమిటీ రాబోతోంది!

ఆన్‌లైన్ గేమింగ్… నేటి యువతను పెడతోవలో పెట్టిస్తున్న భయంకరమైన వ్యవస్థలలో ఇది ఒకటి.అవును… ఆట అనేది ఒకప్పుడు ఆటవిడుపుగా రోజులో కాసేపు ఆడేవారు.కానీ నేడు కోట్లమంది యువత ఆన్లైన్ గేమ్స్‌లో గంటలపాటు మునిగి తేలుతున్నారు.తత్ఫలితంగా చదువుని నిర్లక్ష్యం చేస్తున్నారు, బాధ్యతల్ని విస్మరిస్తున్నారు.అందువలన ఒక్కో క్రమంలో వీరు ఆన్లైన్ గేమ్స్ కి బానిస అయ్యి, తీవ్ర మానసిక రుగ్మతలకు గురి అవుతున్నారు.ఎక్కడో ఒకచోట వీటి పుణ్యమాని ప్రతి రోజు ఎవరో ఒక్కరు వివిధ కారణాలవలన చెనిపోతూ వున్నారు.

 Government Sets Up Panel To Regulate Online Gaming Details, Online Games, Key De-TeluguStop.com

అయితే ఇలాంటి సంఘటనల దృష్ట్యా, రాబోయే తరాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్ గేమ్స్ ని నియంత్రించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం.

అవును.

ఆన్‌లైన్ గేమ్స్ విషయంలో అంతర్జాతీయంగా అమలవుతున్న విధానాలు, వీటిని నియంత్రించేందుకు అవసరమైన వ్యవస్థ రూపకల్పన వంటివి ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.ఈ గేమ్స్‌ను ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి తేవాలో కూడా ఈ కమిటీ సూచించనుంది.

ఈ కమిటీలో నీతి అయోగ్ సీఈవోతోపాటు కేంద్ర హోం శాఖ సెక్రటరీ, క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖలకు చెందిన సెక్రటరీలు సభ్యులుగా ఉంటారు.ఆన్‌లైన్ గేమ్స్ నియంత్రణ, విధి విధానాలు, అంతర్జాతీయ ప్రమాణాలు, నియమ నిబంధనలు వంటి వాటిని కమిటీ అధ్యయనం చేసి, నివేదిక అందజేస్తుంది.

Telugu Central, India, Key, Latest, Games, Games Committee, Regulate-Latest News

ఇందులో భాగంగా గేమ్స్‌కు యువత అడిక్ట్ అవ్వకుండా, వాళ్లకు హాని కలిగించకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎంత సేపు గేమ్స్ ఆడాలి? వంటి అంశాల్లో స్పష్టమైన నిబంధనలను ఈ కమిటీ తీసుకురానుంది.ఈ విషయాల్లో ఎలాంటి చట్టాలు చేయాలో కూడా కమిటీనే నిర్ణయిస్తుంది.ఆన్‌లైన్ గేమ్స్‌పై 28% జీఎస్టీ విధించాలని గతంలో మంత్రుల కమిటీ సూచించిన విషయం తెలిసినదే.అయితే, దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.ఫాంటసీ గేమ్స్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదాయం వస్తోంది.2020లో దాదాపు 20.36 బిలియన్ డాలర్ల ఆదాయం రాగా, 2025కల్లా ఈ ఆదాయం 38.60 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఓ సర్వే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube