చికాగోలో ఉంటూ శాలరీ పొందుతున్న గవర్నమెంట్ టీచర్.. దొరికిపోయిందిగా..?

గుజరాత్‌లోని( Gujarat ) బనస్కాంత జిల్లాలో ఓ షాకింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చింది.

అమెరికాలో స్థిరపడిన ఓ ఉపాధ్యాయురాలు, ఇంకా గుజరాత్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం చేస్తున్నట్లు అన్యాయంగా శాలరీ పొందుతోంది.

ఆమెకు అమెరికా గ్రీన్‌కార్డ్ ఉందని, చాలా సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెప్పారు.అయినా కూడా, ఆమె ప్రతి నెలా జీతం తీసుకుంటూనే ఉంది.

ఆమె పేరు భవనాబెన్ పటేల్.( Bhavnaben Patel ) పంచా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా ఇంతకుముందు పనిచేసేది.ఇప్పటికీ కూడా అక్కడే పని చేస్తున్నట్లు అందర్నీ ఒప్పిస్తోంది.

కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు( Government Teacher ) ఉత్తిపుణ్యానికే జీతాలు తీసుకుంటూ పిల్లలకు అన్యాయం చేస్తున్నారని ఈ ఘటన చెప్పకనే చెబుతోంది.భవనాబెన్ పటేల్ 2016 నుంచి అమెరికాలోని చికాగో నగరంలో( Chicago ) నివసిస్తోంది.

Advertisement

సంవత్సరానికి ఒక నెల మాత్రమే పాఠశాలకు వచ్చి, మిగతా 11 నెలలు అనధికారంగా సెలవు తీసుకుంటూ ఉంది.ఆ పాఠశాలలో ప్రస్తుతం ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా ఉన్న పరుల్ మెహతా అనే మహిళ ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు.

గుజరాత్‌ ప్రభుత్వం ఈ విషయంపై విచారణకు ఆదేశించింది.

గుజరాత్‌ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కుబేర్ దిందోర్ మాట్లాడుతూ ఆమె తప్పు చేసిందని తేలితే ఆమెపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రఫుల్ పాన్షేరియా మాట్లాడుతూ, జనవరి నెల నుంచి భవనబెన్ పటేల్‌కు జీతం ఇవ్వలేదని చెప్పారు.భవనాబెన్ పటేల్ 2027లో రిటైర్ కానున్నారు.

కాబట్టి ఈ విషయం ఇంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.ఇక స్టూడెంట్స్ ని అడిగితే ఆ టీచర్ రెండు మూడు ఏళ్ల నుంచి తమకు కనపడలేదని చెప్పి షాక్ ఇచ్చారు.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...

మొత్తం మీద ఈ వ్యవహారం భారతదేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.ఇలాంటి టీచర్లను కనిపెట్టడానికి ఉన్నతాధికారులు చర్యలు చేపట్టవచ్చు.

Advertisement

తాజా వార్తలు