ఇక్కడ స్మార్ట్‌ఫోన్ వాడనివారు దాదాపుగా ఉండరనే చెప్పుకోవాలి.ప్రస్తుతం అన్ని రకాల అవసరాల కోసం ఫోన్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి.
ఎలా అంటే నిత్యావసర వస్తువులు ఏది కొన్నా స్మార్ట్ ఫోన్ ద్వారానే చెల్లింపులు అనేవి చేస్తున్నాం.ఒకప్పటిలాగా జేబుల్లో డబ్బులు పట్టుకొని తిరిగే పరిస్థితి ఇపుడు లేదని చెప్పుకోవాలి.
ఇలాంటి పరిస్థితుల్లో ఫోన్ ఒకవేళ సడెన్ గా పొతే ఎలాగుంటుంది? ఆ ఆలోచనే భయం వేస్తోంది కదూ.ఇలాంటి సమయాల్లో ఫోన్ ట్రాక్ చేసే అవకాశాలను పెంచేందుకు గూగుల్ ( Google ) ఓ కొత్త ఫీచర్‌ను అందించనుంది.
![]()
అవును, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫైండ్ మై డివైజ్ ఫీచర్‌ను( Find My Device ) ఆఫ్‌లైన్ మోడ్‌లో కూడా వర్క్ చేసేలా గూగుల్ అప్డేట్ చేయనుంది.పిక్సెల్ పవర్ ఆఫ్ ఫైండర్ పేరిట లేటెస్ట్ ఫీచర్ తీసుకొస్తోంది.పోగొట్టుకున్న పిక్సెల్ ఫోన్( Pixel Phone ) ఆఫ్‌లో ఉన్నప్పటికీ దాన్ని గుర్తించడంలో ఈ ఫీచర్ సహాయపడగలదు.ఈ ఫీచర్ ఫోన్ ఆఫ్‌లో ఉన్నప్పటికీ, ఫోన్ బ్లూటూత్‌ని అన్ని సమయాల్లో ఆన్‌లో ఉంచుతుంది.
యాపిల్ ఐఫోన్లో అందుబాటులో ఉన్న ట్రాకింగ్ ఫీచర్లా ఇది పని చేస్తుందని చెప్పుకోవచ్చు.
![]()
అయితే ఈ ఫీచర్‌కి కొంత హార్డ్‌వేర్ సపోర్ట్ అవసరం ఉంటుంది.మార్కెట్లో ఇప్పటికే ఉన్న ఆండ్రాయిడ్ డివైజ్‌లు ఈ ఫీచర్‌కి సపోర్ట్ చేస్తాయా? లేదా? అనే అంశంపై ఇంకా స్పష్టత అనేది లేదు కానీ, భవిష్యత్తులో ఈ ఆప్షన్‌కు సపోర్ట్ చేసేలా స్మార్ట్ఫోన్లు వస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.దాదాపు ఒక సంవత్సరం నుంచి ఫైండ్ మై డివైజ్ ఫీచర్‌కి అప్డేట్ వస్తుందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.
అయితే ఇది ఓ అంచనాగానే తెలుస్తోంది.ఈ శక్తివంతమైన కొత్త ట్రాకింగ్ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే అంశంపై మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత లేదు.






