నిజామాబాద్ కేంద్రంగా... టార్గెట్ ఫిక్స్ చేసుకున్న కవిత !

ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi likker scam ) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేంద్రంపై రాజీ లేకుండా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు.ఇప్పటికే బీఆర్ఎస్ ను దేశవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నాల్లో ఉన్న కేసిఆర్ తో పాటు,  కవిత కూడా గతం కంటే మరింత యాక్టివ్ అయ్యారు.

 Kalvakuntla Kavitha Political Strategy In Nijamabad , Nijamabad Mp, Arvind Dhar-TeluguStop.com

కేంద్రంపై రాజీ లేకుండా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు.దీనిలో భాగంగానే రాబోయే ఎన్నికల్లో నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారు.

ముఖ్యంగా అక్కడ ఉన్న బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ను ఓడించి నిజామాబాద్ జిల్లాలో పట్టు సాధించాలనే ఉద్దేశంతో  ఈ లోక్ సభ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాల పైన దృష్టి సారించారు.

Telugu Bjp Mp, Brs, Brs Mlc, Kavitha, Nijamabad Mp, Telangana Cm-Politics

తరచుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.తాజాగా  జగిత్యాల లో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.

కార్యకర్తల్లో ఉత్సాహం పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.దీంతో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను ఇరుకును పెట్టే ప్రయత్నం కవిత( kalvakuntla Kavitha ) మొదలుపెట్టారు.

ముఖ్యంగా నిజామాబాద్ కు పసుపు బోర్డు తెస్తానని , గత లోక్ సభ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ధర్మపురి అరవింద్,  ఇప్పటికీ ఆ హామీ నెరవేర్చుకోకపోవడం,  కేంద్రం కూడా పసుపు బోర్డు ఏర్పాటు చేసే ఆలోచన లేదని తేల్చి చెప్పడంతో ఈ అంశం కవిత వ్యూహాలు రచిస్తున్నారు.

Telugu Bjp Mp, Brs, Brs Mlc, Kavitha, Nijamabad Mp, Telangana Cm-Politics

 ఎంపీ అరవింద్( Arvind Dharmapuri ) తీసుకువచ్చిన పసుపు బోర్డు ఇదే అంటూ నిజామాబాద్ జిల్లాలో పసుపు రంగు బోర్డులు ఏర్పాటు చేయడం, అవి వైరల్ కావడంతో ధర్మపురి అరవింద్ ఇబ్బందులు పడుతున్నారు.ఇదే తరహాలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి అరవింద్ ను ఓడించడమే లక్ష్యంగా కవిత ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కవిత నిజామాబాద్ అర్బన్ , బోధన్, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా,  ఆమె మాత్రం ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల్లో ఎంపీగానే పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారట .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube