ఇకపై ఆ యాప్ సేవలు నిలిపేస్తున్న గూగుల్.

రోజురోజుకి ప్రపంచంలో స్మార్ట్ డివైజ్లకు ఆదరణ బాగా పెరుగుతోంది.

ఇందులో భాగంగానే స్మార్ట్ డివైజ్లను ఎక్కువగా ఉపయోగించే వారు అనేక రకాల ఆ యాప్స్ ను వాడుతుండటంతో.

పెద్ద ఎత్తున యాప్స్ ను రూపొందిస్తున్నాయి అనేక కంపెనీలు.ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను యాప్స్ లో పొందుపరుస్తూ వారి వినియోగదారులకు అందిస్తూ ఉంటాయి.

అయితే తాజాగా గూగుల్ సంస్థ మాత్రం ఇందుకు కాస్త విరుద్ధంగా వెళుతున్నట్లుగా కనిపిస్తోంది.స్మార్ట్ రూటర్ లను నిర్వహించే గూగుల్ వైఫై యాప్ లో అధికారికంగా ఆశిస్తున్నట్లు గూగుల్ సంస్థ తెలియజేసింది.

ఇందుకు కారణం గూగుల్ తమ యూజర్ల కోసం అన్ని రకాల కనెక్టెడ్ ప్రొడక్షన్ ఒకే ఫ్లాట్ ఫామ్ పైకి తీసుకురావాలని గూగుల్ భావించడమే.అయితే దీని ప్రభావం పెద్దగా కనిపించవు.

Advertisement

దీనికి కారణం గూగుల్ వైఫై యాప్ సదుపాయాలని పూర్తిగా గూగుల్ హోమ్ యాప్ కు మార్చేస్తున్నారు.రాబోయే రోజుల్లో స్మార్ట్ కనెక్టివిటీ సేవలను కస్టమర్లు వారి గూగుల్ హోమ్ యాప్ ద్వారా మాత్రమే పొందడానికి వీలు కల్పిస్తుంది గూగుల్.

ఇకపోతే గూగుల్ హోమ్ యాప్ కు మారడం మొత్తం రెండు దశల్లో జరుగుతుంది.ఇందులో ముందుగా గూగుల్ వైఫై యాప్ లోని ముఖ్యమైన ఫీచర్లను సంస్థ మే 25న ఆపి వేయడం జరుగుతుంది.

ఆ తర్వాత వాటి సేవలను పూర్తిగా గూగుల్ హోమ్ యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకరాబోతున్నట్లు సమాచారం.మే 25 తర్వాత గూగుల్ వైఫై యాప్ గూగుల్ ప్లే స్టోర్, ios లలో నుండి తొలగించబోతున్నారు.

ఇకపై వైఫై రూటర్ లను గూగుల్ హోమ్ యాప్ లో మాత్రమే కాన్ఫిగర్ చేయడానికి గూగుల్ సన్నాహాలు చేస్తోంది.ఇలా గూగుల్ హోమ్ కి మార్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని గూగుల్ వెల్లడిస్తోంది.వైఫై ని ఆఫ్ చేసుకోవడం, అలాగే వైఫై ఉపయోగిస్తున్న సమయంలో ఇంటర్నెట్ స్పీడ్ ఎలా ఉందో తెలుసుకోవడం అలాగే వివిధ రకాల సేవలను గూగుల్ అసిస్టెంట్ ద్వారా గూగుల్ హోమ్ యాప్ లలో యాక్సిస్ చేసుకోవచ్చని గూగుల్ తెలుపుతోంది.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
అమెరికన్ వర్సిటీలలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. అన్నింటికీ బైడెనే కారణం : డొనాల్డ్ ట్రంప్

ఇందుకోసం నెట్వర్క్ సెటప్ ను వేరే యాప్ కి ఎలా మార్చుకోవాలో అనే విషయాలను కూడా గూగుల్ తెలియజేసింది.ఒక్కసారి గూగుల్ హోమ్ యాప్ కు వచ్చిన తర్వాత వారు మళ్లీ బయటకు తిరిగి రావడం సాధ్యం కాదని గూగుల్ తెలియజేస్తోంది.

Advertisement

తాజా వార్తలు