గూగుల్ TV గురించి వినే వుంటారు, అదేనండి.గూగుల్ క్రోమ్‌కాస్ట్. ఈ డివైజ్ త్వరలో ఇండియాలో లాంచ్ కాబోతోందోచ్.4K సపోర్ట్‌తో రానున్న ఈ క్రోమ్‌కాస్ట్ అధికారిక లాంచ్ తేదీని ఇంకా ప్రకటించలేదు కానీ Flipkart ఈ కొత్త ప్రొడక్ట్‌ను ధరతో పాటు తన వెబ్‌సైట్ లిస్టింగ్‌లో ఉంచడం గమనార్హం.దాంతో లాంచ్ తేదీ ఆసన్నమైనట్లు మనకు అర్ధం అవుతోంది.ఇక ఈ గూగుల్ క్రోమ్‌కాస్ట్ విత్ టీవీ 4Kని లిస్ట్ చేసి దీని ధరను రూ.6,399గా తెలిపింది Flipkart.ఈ 4K వెర్షన్ మంచు లాంటి తెలుపు రంగులో లాంచ్ కానుందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.
సాధారణంగా ఏదైనా ఈ-కామర్స్ ఒక ప్రొడక్ట్‌ను లిస్ట్ చేసిందంటే అది అతి త్వరలో లాంచ్ అవుతుందని అర్థం.అందువలన ఈ గూగుల్ క్రోమ్‌కాస్ట్ కూడా త్వరలోనే ఇండియన్ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వొచ్చనే అంచనాలు వున్నాయి.
ఇక ఈ గూగుల్ క్రోమ్‌కాస్ట్ విత్ TV అధికారికంగా కొన్నేళ్ల క్రితమే అందుబాటులోకి వచ్చింది.అయితే ఈ డివైజ్ ఇప్పటి వరకు భారత్‌లో లాంచ్ కాకపోవడం కొసమెరుపు.
కాగా గత నెలలో గూగుల్ క్రోమ్‌కాస్ట్ విత్ టీవీని భారత్‌తో సహా మరో 12 దేశాలలో లాంచ్ చేస్తామని కంపెనీ ఒక నివేదికలో పేర్కొన్న విషయం తెలిసినదే.

గూగుల్ ఈ డివైజ్‌ను లాంచ్ చేసే ముందు అందులోని ఫీచర్లను ఇండియన్ యూజర్ల అవసరాలకు తగినట్లుగా ఇవ్వాలని యోచిస్తోంది.ఈ కారణంగానే ఈ డివైజ్ ఇంకా ఇండియాలో లాంచ్ కాలేదని గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది.ఫీచర్స్ విషయానికొస్తే…
1.క్రోమ్‌కాస్ట్ ప్రతి సెకన్‌కు 60 ఫ్రేమ్‌ల చొప్పున 4K HDR క్వాలిటీ వీడియోలను అందిస్తుంది.
2.వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడానికి డాల్బీ విజన్ సపోర్ట్‌తో రాబోతోంది.
3.Netflix, యూట్యూబ్ కోసం డెడికేటెడ్ బటన్‌లతో క్రోమ్‌కాస్ట్ రిమోట్ రూపొందనుంది.
4.
ఇందులో 8GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంది.