గుడ్ న్యూస్: IPL 2022 భారత్ లోనే.. కన్ఫామ్ చేసిన BCCI.!

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న IPL-2022 ఎక్కడ నిర్వహిస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.ఈ నేపథ్యంలో BCCI చీఫ్ గంగూలీ తాజాగా కిక్కిచ్చే వ్యాఖ్యలు చేశాడు.

IPL-2022 ఎక్కడ జరుగుతుంది? అనే ప్రశ్నకి ఇపుడు సమాధానం దొరికింది.ఇకపోతే, దేశంలో ఓమైక్రాన్ ఉదృతి నేపథ్యంలో ఈ క్యాష్ రిచ్ లీగ్ ను గత రెండు సీజన్ల మాదిరిగానే దుబాయ్ లో నిర్వహిస్తారని గతంలో వార్తలు వినిపించాయి.

ఈ క్రమంలో మన బెంగాల్ టైగర్ ఆడిపోయే వార్త చెప్పారు.IPL 2022 భారత్ లోనే.IPLను భారత్ లోనే నిర్వహించాలని టీమిండియా అభిమానులతో పాటు మన క్రికెటర్లు కూడా BCCIని కోరారు.

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, గుజరాత్ లలో ఈ మెగా టోర్నీని నిర్వహించేందుకు BCCI సన్నాహాలు చేస్తుందని పలు ఛానెళ్లు కూడా ప్రత్యేక కథనాలను ప్రసారం చేశాయి.అయితే దీనిపై BCCI ఇంతవరకూ స్పందించలేదు.

Advertisement

ఈ తరుణంలో తాజాగా BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.తదుపరి IPL ఇండియాలోనే జరుగుతుందని ప్రకటించాడు.

ఆ విషయాన్ని గంగూలీ మాటల్లోనే.తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానెల్ వేదికగా గంగూలీ మాట్లాడుతూ."కరోనా ఈసారి మనకి సహకరించితే IPLను ఇండియాలోనే నిర్వహిస్తాం.

గతంలో మేము చెప్పిన మాదిరిగానే భారత్ లోనే IPLను నిర్వహించడానికి మేము ఎంతగానో ఎదురుచూస్తున్నాం.ముంబై, పూణెలలో మ్యాచులను ప్లాన్ చేస్తున్నాం.

లీగ్ మ్యాచులైతే ఇక్కడే నిర్వహిస్తాం.అహ్మదాబాద్ విషయం గురించి ఇంకా క్లారిటీ రాలేదు.

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!
పర్వత సింహంతో పోరాడిన కుక్క.. వీడియో చూస్తే వణుకే..

ఏప్రిల్-మేలలో పరిస్థితులు ఎలా ఉంటాయో.అప్పటి పరిస్థితుల ఆధారంగా దానిమీద ఓ నిర్ణయం తీసుకుంటాం" అని దాదా అన్నారు.

Advertisement

తాజా వార్తలు