Twitter యూజర్లకు గుడ్ న్యూస్… త్వరలో డిజిటల్ పేమెంట్స్!

ప్రస్తుత సమాజంలో స్మార్ట్ ఫోన్స్ వాడని వారంటూ ఎవరూ వుండరు.

దానికి తగ్గట్టే బ్యాంకులు కూడా లేటెస్ట్ టెక్నాలజీకి అనుగుణంగా చెల్లింపు పద్ధతుల విషయంలో కొత్త కొత్త మార్గాలను అనుసరిస్తున్నాయి.

ముఖ్యంగా భారత్లో చూసుకుంటే నోట్ల రద్దు సమయంలో NPCI ప్రవేశపెట్టిన UPI చెల్లింపు పద్ధతి బాగా జన ప్రాచుర్యం పొందింది.ఈ క్రమంలో బ్యాంకుల వద్ద నెఫ్ట్, RTGS వంటి చెల్లింపులు దాదాపుగా తగ్గిపోయాయి.

ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ ఇలా అన్ని కంపెనీలు తమ యాప్స్ లో యూపీఐ పేమెంట్స్ తో కూడిన చెల్లింపులు చేయడానికి అనుమతిస్తున్నాయి.

ఇకపోతే వాట్సాప్ కూడా UPI చెల్లింపులు చేసేలా వినియోగదారులను ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసినదే.ఇదే బాటలో ట్విట్టర్ కూడా నడవడానికి సిద్ధమవుతుంది.ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేయడానికి ముందు ఇలాంటి చర్చలే నడిచినప్పటికీ మస్క్ CEO అయ్యాక ఈ ప్రతిపాదన గురించి వార్తలు రాలేదు.

Advertisement

ప్రస్తుతం మళ్లీ ట్విట్టర్ ద్వారా చెల్లింపులు అనే అంశం మరలా తెర మీదకు వచ్చింది.మస్క్ ట్వీట్టర్ సీఈఓ అయ్యాక కంపెనీ ఎలాంటి ఒడిదుడుకులను చవిచూస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇలాంటి తరుణంలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.

ప్రస్తుతం ట్విట్టర్ ఎడ్వటైజ్ మెంట్ల ద్వారా వచ్చే భారీ ఆదాయాన్ని కోల్పోయినట్టు సమాచారం.దీంతో ట్విట్టర్ ప్రతినిధులు ఇతర ఆదాయ మార్గాల వైపు దృష్టి సారిస్తున్నట్టు కనబడుతోంది.ట్విట్టర్ లో ప్రొడెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్తేర్ కాఫోర్డ్ ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నట్టు పలు నివేదికలు నివేదిస్తున్నాయి.

అయితే ఈ వార్తలపై ట్విట్టర్ ప్రతినిధులు మాత్రం ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం కొసమెరుపు.గతంలో మస్క్ తమ ట్విట్టర్ ను ది ఎవ్రీ థింగ్ యాప్ గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

ఇదేందయ్యా ఇది.. కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తున్న హీరోయిన్..
సినిమా వాళ్ళ దెబ్బకి విశ్వక్ సేన్ అడ్రస్ మార్చేశాడట !

దీంతో ట్విట్టర్ భవిష్యత్ లో కచ్చితంగా చెల్లింపులు ఫీచర్ ను తీసుకొస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు