అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త.. శబరిమలలో కొత్తగా..

కేరళలో వెలిసిన అయ్యప్ప స్వామిని( Ayyappa Swami ) దర్శించుకోవడానికి ప్రతి ఏడాది లక్షలాదిమంది భక్తులు శబరిమలకు( Sabarimala ) వెళ్తూ ఉంటారు.

అయ్యప్ప మాలను ధరించి, మండలం పాటు నిష్ఠతో మణికంఠుడిని పూజిస్తారు.

ఆ తర్వాత అయ్యప్పను దర్శించుకోవడానికి తరలి వెళ్తుంటారు.శబరిమలకు వెళ్లే భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

శబరిమల గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టు( Sabarimala Greenfield Airport Project )కు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సైట్ క్లియరెన్స్ మంజూరు చేసింది.కొట్టాయం జిల్లాలోని చెరువల్లి ఎస్టేట్ సమీపంలో ఈ విమానాశ్రయాన్ని నిర్మించాలని కీలక నిర్ణయం తీసుకుంది.

శబరిమల సమీప ప్రాంతాలను పర్యటించిన తర్వాత చెరువల్లి ప్రాంతం ఈ శబరిమల గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సరిపోతుందని నిర్ణయించింది.ఈ చెరువల్లి గ్రామం ( Cheruvalli village )సెంట్రల్ కేరళ పరిధిలోకి వస్తుంది.

Advertisement
Good News For The Devotees Of Ayyappa Swamy New In Sabarimala , Ayyappa Swamy

ఈ గ్రామం సెంట్రల్ ట్రావెన్‌కూర్ రీజియన్ పరిధిలోని ఐదు జిల్లాల సరిహద్దులకు అనుకుని ఉంటుంది.వెనుకబడిన ప్రాంతంగా దీనిని దీనికి గుర్తింపు ఉంది.

Good News For The Devotees Of Ayyappa Swamy New In Sabarimala , Ayyappa Swamy

ఈ ఎయిర్‌పోర్టును నిర్మించడం వల్ల ఈ ఐదు జిల్లాల ప్రజలకు అనుకూలంగా ఉంటుందని, ఆయా జిల్లాలన్నీ అభివృద్ధి చెందుతాయని కేంద్రం భావిస్తుంది.శబరిమల ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అనుకూలమైన ప్రదేశాన్ని ఎంపిక చేయాలంటూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కేరళ ప్రభుత్వానికి ప్రతిపాదనను పంపింది.అంతేకాకుండా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చిన నేపథ్యంలో డీజీసీఏ, ఏఏఐ ఈ క్లియరెన్సులను జారీ చేసింది.

Good News For The Devotees Of Ayyappa Swamy New In Sabarimala , Ayyappa Swamy

దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించాల్సి ఉంటుంది.దీనికోసం కేరళ ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రాథమిక చర్యలను చేపట్టింది.డీపీఆర్ విమానాశ్రయ నిర్మాణం కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా స్పెషల్ పర్పస్ వేదికలను ఏర్పాటు చేస్తోంది.

భూ సేకరణ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానిస్తుంది.ఈ ఎయిర్ పోర్టు కోసం కేరళ ప్రభుత్వం 2570 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటున్నట్లు వెల్లడించింది.

పరమశివుని ప్రత్యేక ఆశీస్సులు ఉన్న రాశులు ఇవే..
Advertisement

తాజా వార్తలు