గూగుల్ వన్, పిక్సెల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి వస్తున్న మ్యాజిక్ ఎరేజర్..!

పిక్సెల్ 6 ద్వారా గూగుల్ “మ్యాజిక్ ఎరేజర్” పేరుతో ఒక అద్భుతమైన ఫొటో ఎడిటింగ్ ఫీచర్‌ను పరిచయం చేసిన విషయం తెలిసిందే.కాగా త్వరలోనే పిక్సెల్ వినియోగదారులందరికీ ఈ ఫీచర్‌ను గూగుల్ కంపెనీ అందుబాటులోకి తీసుకురానుంది.

 Good News For Google One And Pixel Users Magic Eraser Is Now Available , Google-TeluguStop.com

ఆల్రెడీ కొందరికి ఈ ఫీచర్‌ని తీసుకొస్తుంది.గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉన్న నాన్-పిక్సెల్ యూజర్లకు ఈ ఫీచర్ గూగుల్ ఫొటోస్‌ యాప్ ద్వారా అందుబాటులో ఉంటుంది.

అలాగే iOS వినియోగదారులకు కూడా గూగుల్ ఫొటోస్ ద్వారా ఇది అందుబాటులో ఉంటుంది.గూగుల్ ఫొటోస్‌ యాప్ వీడియోల కోసం HDRని కూడా పొందుతోంది.

ఈ హెచ్‌డీఆర్ గూగుల్ వన్ సబ్‌స్క్రైబర్లందరికీ కూడా అందుబాటులో ఉంటుంది.

Telugu Android, Google, Google Pixel, Ios, Magic Eraser-Latest News - Telugu

మ్యాజిక్ ఎరేజర్ ఫీచర్‌ను ఉపయోగించి ఒక ఫొటోలో ఉన్న అవసరం లేని వ్యక్తులను ఈజీగా తొలగించవచ్చు.ఇది ఫోటోలు ఎక్కువగా దిగేవారికి, అలాగే మంచి ప్రాంతాలలో మంచి ఫొటోలు దిగాలనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది.ఇకపోతే గూగుల్ వన్ సబ్‌స్క్రైబర్‌లు గూగుల్ ఫోటోల యాప్ కోల్లెజ్ ఎడిటర్‌లో ఒకే ఫోటోకు స్టైల్స్‌ని అప్లై చేసుకోవచ్చు.

పిక్సెల్, గూగుల్ వన్ యూజర్స్ కి కొత్త సిరీస్ స్టైల్స్ రాబోతున్నాయని గూగుల్ చెబుతోంది, కాబట్టి వారు ఎంచుకోవడానికి మరిన్ని డిజైన్‌లు అందుబాటులో ఉంటాయి.వాటితో వారు కోల్లెజ్‌లను తయారు చేసుకోవచ్చు.

Telugu Android, Google, Google Pixel, Ios, Magic Eraser-Latest News - Telugu

గూగుల్ వన్ సబ్‌స్క్రైబర్‌లు, పిక్సెల్ యూజర్‌లందరికీ కొత్త గూగుల్ ఫొటోస్ ఫీచర్‌ల రోల్ అవుట్ ఇప్పటికే కంపెనీ ప్రారంభించబడింది.మీరు గూగుల్ వన్‌ సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేసే ముందు కొత్త ఫీచర్‌లను ప్రయత్నించడానికి మార్చి ప్రారంభంలో గూగుల్ ఫొటోస్ లో ఫ్రీ ట్రయల్ అందించవచ్చు.ఆ ట్రయల్ ఉపయోగించడం ద్వారా మీరు గూగుల్ వన్‌ సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకోవచ్చా లేదా అనేది నిర్ణయించుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube