గాడ్జెట్స్ ప్రియులకు టెక్ దిగ్గజం ఆపిల్( Apple ) ఓ శుభవార్త తీసుకువచ్చింది.అదేమంటే టచ్ డిస్‌ప్లే కలిగినటువంటి ఎయిర్ పోడ్స్ ఛార్జింగ్ కేస్ ఒకదానిని తీసుకువస్తున్నట్టు అనౌన్స్ చేసింది.
దీని వలన అనేక లాభాలున్నాయి.వినియోగదారులు యాప్‌లను యాక్టివేట్ చేసుకోవచ్చు.
అదేవిధంగా దానిపైన సినిమాలు కూడా చూసుకొనే వీలుంది.ఐఫోన్ ని టచ్ చేయకుండానే నిర్దిష్ట సమాచారాన్ని వినియోగదారుడు తెలుసుకోగలుగుతాడు.
అంతేకాకుండా ఆడియో బుక్స్, మెసేజస్, టెక్స్ట్ ఫైల్స్ వంటివి తేలికగా చదవచ్చు.
ఇది కేస్ మూసివేసే చోట స్క్రీన్ ముందు భాగంలో ఉంటుందని ఆపిల్ హోమ్ డివైజ్‌కు కనెక్ట్ అయినట్లుగా ఫొటోస్ ని తాజాగా పోస్ట్ చేసింది ఆపిల్.
ఆపిల్ ద్వారా మొదటగా మార్కెట్లోకి రాబోతున్న ఈ ఐడియా సెప్టెంబర్ 19, 2022న US పేటెంట్ & ట్రేడ్‌మార్క్ కార్యాలయంలో దాఖలు చేసినట్టు తెలుస్తోంది.ఈ సందర్భంగా ఆ స్క్రీన్ వినియోగదారులకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుందనే దాని గురించి చెప్పుకొచ్చింది ఆపిల్.

ఇక కేసు ముందు భాగంలో ఉన్న ఆప్టికల్ సెన్సార్ సెల్ఫీలను తీయడానికి, వీడియో కాన్ఫరెన్స్‌లను అనుమతించడానికి వీలుగా ఒక కెమెరాను కలిగి ఉండడం విశేషం.ఆపిల్ స్టాక్స్, కాలిక్యులేటర్, క్లాక్ వంటి యాప్‌లకు కూడా ఇందులో యాక్సెస్ లభిస్తుంది.భవిష్యత్ అవసరాలు నిమిత్తమే ఈ ఐడియాను ఇంప్లీమెంట్ చేసినట్టు ఆపిల్ తన బ్లాగులో తెలిపింది.అంటే మొబైల్ ఫోన్ క్యారీ చేయడం మర్చిపోనపుడు ఈ ఎయిర్ పాడ్( AirPods )అనేది ప్రత్యామ్నాయంగా వర్క్ చేయగలదు.
అంతేకాకుండా సదరు మొబైల్ స్విచ్ ఆఫ్ అయినపుడు, లేదంటే ఎక్కడన్నా పోయినపుడు ఈ ఎయిర్ పాడ్స్ చాలా ఉపయోగపడగలవు అని ఆపిల్ పేర్కొంటోంది.







