జనసేన కీలక నేత నాదెండ్ల మనోహార్ ( Nadendla Manohar )కీలక వ్యాఖ్యలు చేశారు.పొత్తు అంశంలో కొన్ని అసంతృప్తిలో ఉన్నప్పటికీ టీడీపీ, జనసేన నేతలు( TDP , Jana Sena leaders ) కలిసి పని చేశారని కొనియాడారు.
సమస్యలను పక్కన పెట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ముందుకు నడిచారని నాదెండ్ల తెలిపారు.రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా తమ అడుగులు ఉంటాయని స్పష్టం చేశారు.
ప్రజలు తమపై ఎంతో నమ్మకంతో అందించిన విజయానికి ధన్యవాదాలు తెలిపారు.ప్రజలు ఎదురు చూస్తున్న మంచి రోజులు ఇవాళ్టి నుంచే ప్రారంభం అవుతున్నాయని నాదెండ్ల వెల్లడించారు.
అయితే ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయం సాధించిన సంగతి తెలిసిందే.