ప్యాంట్ వేసుకోలేదంటున్న గోవా బ్యూటీ....

టాలీవుడ్ లో ఒకప్పుడు మాస్ మహారాజ రవితేజ, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదితర స్టార్ హీరోల సరసన నటించినటువంటి హీరోయిన్లలో గోవా బ్యూటీ మరియు జీరో సైజు నడుము చిన్నది ఇలియానా ఒకరు.

ఈ అమ్మడు టాలీవుడ్ లో కెరీర్ మంచి ఫామ్లో ఉన్న సమయంలో బాలీవుడ్ పై మనసు పారేసుకుంది.దీంతో అనుకున్నదే తడవుగా వెంటనే తన మకాం ని బాలీవుడ్ కి మార్చింది.అయితే అక్కడ బాగానే అవకాశాలు దక్కించుకున్నప్పటికీ సరైన హిట్ లేకపోవడంతో ప్రస్తుతం ఇలియానా సినీ కెరియర్ ప్రమాదంలో పడినట్లుంది.

అయితే సినిమాల పరంగా అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం ఈ అమ్మడు తన అభిమానులతో సోషల్ మీడియాలో తెగ అందుబాటులో ఉంటోంది.అయితే తాజాగా ఇలియానా తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తనకు సంబంధించిన  ఓ పాత ఫోటోని తన అభిమానులతో పంచుకుంది.

ఈ ఫోటోఅయితే కి నా చిన్న జుట్టులో పూలు పెట్టుకున్నాను కానీ ప్యాంట్ వేసుకోలేదు అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. ఈ ఫోటోలో ఇలియానా బికినీ దుస్తుల్లో కనిపిస్తోంది.

దీంతో నెటిజన్లు ఈ ఫోటోని తెగ ట్రోల్స్ చేస్తున్నారు.అయితే ఇలియానా ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక్కరోజులోనే దాదాపుగా 8,68,000 పైచిలుకు లైకులు వచ్చాయి.

దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు సోషల్ మీడియాలో ఇలియానా కి ఉన్న క్రేజ్ మరియు ఫాలోయింగ్ గురించి.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఇలియానా బాలీవుడ్లో "ది బిగ్ బుల్" అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రంలో హీరోగా అభిషేక్ బచ్చన్ నటిస్తుండగా బాలీవుడ్ ప్రముఖ హీరో అజయ్ దేవగన్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించి నటువంటి షూటింగ్ పనులు జూన్ నెల నుంచి మొదలు కానున్నాయి.

తాజా వార్తలు