పెళ్లి. ఈ రెండు అక్షరాల పదం జీవితంలో ఎంత ప్రాముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
పెళ్లి చేసుకునే ప్రక్రియలో భాగంగా ఓ వ్యక్తి అనేక విషయాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.ముందుగా పెళ్లిళ్లు హిందూ సాంప్రదాయంలో ప్రకారం జరిగే విధంగా ఉంటే అందులో పలు రకాల కార్యక్రమాలు ఉంటాయి.
ఇందులో భాగంగానే మొదట యువతి యువకులు వారి ఫోటోలను చూసుకున్న తర్వాత వారికి ఒకరికి ఒకరు నచ్చిన తర్వాత పెద్దల అంగీకారంతో ఇరువురి కుటుంబాల మధ్య నడుమ పెళ్లిచూపులు నిర్వహిస్తారు.
ఆ తర్వాత అమ్మాయి అబ్బాయి ఇరువురికి నచ్చిన తర్వాతనే పెద్దలు పెళ్లిని ( Marriage ) ఫిక్స్ చేస్తారు.
అయితే తాజాగా ఈ సాంప్రదాయబద్ధంగా జరిగే కార్యక్రమాల్లో భాగంగా ఓ ఇంట్లో ఎంగేజ్మెంట్( Engagement ) కార్యక్రమం జరుగుతోంది.అయితే ఈ కార్యక్రమంలో నమోదైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
యువతి యువకుల ఇరువురు కుటుంబాలు ఎంగేజ్మెంట్ కు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో అక్కడ ఓ రొమాంటిక్ సీన్( Romantic Scene ) రికార్డు అయింది.బంధుమిత్రులందరూ అక్కడే ఉండగా ఆ అమ్మాయి అందరి ముందు ఆ యువకుడికి కన్ను కొట్టింది.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో( Social Media ) తెగ హల్చల్ చేస్తుంది.ఎంగేజ్మెంట్ కారణంగా ఇల్లంతా సందడిగా ఉంది.ఇదే క్రమంలో యువతీ యువకులు మొదటి సారిగా కలవడంతో ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నారు.కానీ ఆ అమ్మాయి మాత్రం ఓ అడుగు ముందు వేసి అబ్బాయికి మెల్లగా యువకుడు వైపు చూసి రొమాంటిగా కన్ను కొట్టింది.
దీంతో ఒక్కసారిగా ఆ యువకుడు షాక్ గురయ్యాడు.ఆ తర్వాత దాని నుంచి తేరుకొని అబ్బాయి సిగ్గుపడుతూ తనలో తాను నవ్వుకున్నాడు.

అయితే ఈ సంఘటనని చూసిన బంధువులు కూడా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా వదిలేశారు.ఈ సందర్భానికి సంబంధించిన మొత్తం తతంగాన్ని అక్కడున్న ఓ వ్యక్తి ఎవరికీ తెలియకుండా తన సెల్ ఫోన్ లో రికార్డు చేశాడు.ఈ రికార్డు చేసిన వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయగా ఏకంగా మూడు కోట్ల మందికి పైగా ఈ వీడియోని చూడడంతో ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్ లోకి వచ్చింది.ఇంకెందుకు ఆలస్యం ఈ రొమాంటిక్ సీన్ ను మీరు కూడా ఓసారి లుక్ వేయండి.







