క్యాల్షియం, విటమిన్స్, మినరల్స్ కోసం ఇలా చేస్తే చాలు

పొద్దున్న లేచింది మొదలు పడుకునే వరకూ టీవీలో వచ్చే యాడ్స్ లో చదువుకునే పిల్లల ఎదుగుదలకి కాల్షియం అవసరం ఈ పౌడర్ వాడండి, అది వాడండి అని చెప్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు.అసలు కాల్షియం ఎలా అందుతుంది అంటే కేవలం పాలు త్రాగడం వలన మాత్రమే కాదు.

పాలకంటే అధిక పోషక మరియు మరిన్ని ప్రయోజనాలని కలిగించే నువ్వులు ఎంతగానో ఉపయోగపడుతాయి.50 గ్రాముల నువ్వుల నూనె లో ఎనర్జీ - 442 కేలరీలు ఉంటుంది శాచురేటేడ్ 7 .1 గ్రా, మోనో శాచురేటేడ్ 19.70గ్రా, పాలి శాచురేటేడ్ 21 గ్రా విటమిన్-ఇ, విటమిన్- కే లాంటి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.ఎన్నో పోషక విలువలు కలిగి, విటమిన్స్, మినరల్స్ తో ఆర్గానిక్ కాంపౌండ్ కలిగి ఉండే నువ్వులు, నువ్వుల నూనె వంటకాలలో వాడటం వలన అదనంగా పోషకాలు అందుతాయి.

అంతేకాదు దీనిలో సీసమాల్, సీసమిన్ అనే పాలిన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ బ్లడ్ లో కొలస్త్రాల్ లెవల్స్ ని కంట్రోల్ చేస్తూ గుండెకి రక్షణ కల్పిస్తుంది.దీనిలో ఉండే పైటేట్ అనే ఆర్గానికి కాంపౌండ్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది మరియు మెదడుకి సంతోషాన్ని కలిగించే సెరటోనిన్ అనే హార్మోన్ ని ప్రేరేపించే టైరోసిన్ అనే అమీనో యాసిడ్ నువ్వుల నూనెలో ఉంటుంది.

అంతేకాదు ఎముకలు ధృడంగా పెరగడానికి ఉపయోగపడే జింక్, కాల్షియం నువ్వులలో పుష్కలంగా ఉంటుంది.

ఈ రోజుల్లో అప్పు చేస్తే జీవితకాలం బకాయి తీర్చలేరా..
Advertisement

తాజా వార్తలు