రోడ్డుపై నుండి దర్జాగా వెళ్లిన మొసలి.. షాక్ లో జనం!

దేశవ్యాప్తంగా వర్షాల జోరు కొనసాగుతోంది.ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అని కాకుండా ప్రతి చోట వానలు కురుస్తున్నాయి.

 Giant Crocodile Crossing The Road In Vadodara Crocodile , Vadodara, Road-TeluguStop.com

భారీ వానలతో జన జీవనం అస్తవ్యస్తం అవుతోంది.వారాల తరబడి బీభత్సంగా పడుతున్న వానతో చెరువులు, కుంటలు నిండి బయటకు మత్తళ్లు పారుతున్నాయి.

వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.నదుల్లో నీటి ప్రవాహ వేగంగా గణనీయంగా పెరిగింది.

పరిసర గ్రామాల ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు.లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది.

దాంతో ఆయా ప్రాంతవాసులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

భారీ వర్షాలతో చెరువులు మత్తళ్లు దూకుతున్నాయి.

నదుల్లోని నీరు కుంటల్లోకి చేరుతోంది.గుజరాత్ లో భారీ వర్షాల కారణంగా మొసళ్లు.

నదులు, కాలువల నుండి నివాస ప్రాంతాల్లోకి కొట్టుకు వస్తున్నాయి.ఈ క్రమంలోనే వడోదరా జంబువా గ్రామంలో ఓ మొసలి దర్జాగా రోడ్డు దాటుతూ కనిపించింది.

అలా రోడ్డు దాటుతున్న మొసలిని కొందరు వీడియా తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.అంతలోనే ఈ వీడియో వైరల్ గా మారింది.

మొసలి గ్రామంలోకి రావడం వల్ల గ్రామస్థులంతా భయాందోళనకు గురి అవుతున్నారు.ఇంతటి భారీ మొసళ్లు గ్రామంలో ఉంటే ప్రాణాలకే ప్రమాదం అని అంటున్నారు.

అయితే ఇలా వచ్చిన ప్రాణాలు ఎక్కువ కాలం గ్రామాల్లో ఉండవని… తర్వాత నీళ్లు దొరికే స్థలానికి మెల్లిగా వెళ్లిపోతాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.ముఖ్యంగా మొసళ్ల వంటి నీటిలోనే జీవించే ప్రాణాలు ఎక్కువ కాలం నీరు లేకుండా ఉండవని… వాటికి సురక్షితమైన ప్రాంతం నీరు కాబట్టి.

త్వరలోనే గ్రామం నుండి వెళ్లిపోతాయని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube