గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ( Mayor Gadwala Vijayalakshmi ) కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే మేయర్ విజయలక్ష్మీతో కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ ( Congress in-charge Deepadas Munshi )భేటీ అయ్యారు.
దీంతో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనే ప్రచారం జోరందుకుంది.అయితే ఇప్పటికే 13 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ కూడా సుమారు పది మంది కార్పొరేటర్లతో కలిసి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని సమాచారం.







