Dark neck home remedy : మెడ ఎంత న‌ల్ల‌గా ఉన్నాస‌రే ఈ రెమెడీతో వారం రోజుల్లో తెల్ల‌గా మార్చుకోండి!

సాధారణంగా కొందరి ముఖం తెల్లగా ఉన్న మెడ మాత్రం నల్లగా ఉంటుంది.మెడ నల్లగా మారడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.

ప్రెగ్నెన్సీ, ఎండల ప్రభావం, డెడ్ సెల్స్ పేరుకు పోవడం, మేక‌ప్ తో నిద్రించ‌డం, ఊబకాయం, పీసీఓఎస్‌, హైపోథైరాయిడిజం, అలర్జీలు తదితర కారణాల వల్ల మెడ నల్లగా మారుతుంటుంది.దీంతో మెడ నలుపును వదిలించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటారు.

ఇరుగు పొరుగు వారు చెప్పిన చిట్కాల‌న్నీ ట్రై చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు చింతించకండి.ఎందుకంటే మెడ ఎంత నల్లగా ఉన్నా సరే.ఇప్పుడు చెప్పబోయే రెమెడీ పాటిస్తే వారం రోజుల్లో తెల్లగా మారుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటి.? అన్నది ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ పెరుగును వేసుకోవాలి.

ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ ను వేసుకోవాలి.ఇక చివరిగా వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, రెండు టేబుల్ స్పూన్లు రోజ్‌ వాటర్ వేసుకుని అన్ని కలిసేంత వరకు స్పూన్ తో బాగా మిక్స్ చేసుకోవాలి.

Advertisement
Get Rid Of Dark Neck In A Week With This Remedy! Dark Neck, Home Remedy, Latest

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసి ఐదు నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.

Get Rid Of Dark Neck In A Week With This Remedy Dark Neck, Home Remedy, Latest

అనంతరం వేళ్ల‌తో మెల్ల మెల్ల‌గా స్క్రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ విధంగా చేస్తే నలుపు వదిలిపోయి మెడ తెల్లగా మరియు మృదువుగా మారుతుంది.కాబట్టి ఎవరైతే మెడ నల్లగా ఉందని సతమతం అవుతున్నారో వారు కచ్చితంగా ఈ రెమెడీని పాటించండి.

ఈ రెమెడీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.పైగా తక్కువ సమయంలో మంచి రిజల్ట్ లభిస్తుంది.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు