సముద్రంలో ఉవ్వెత్తున ఎగిసేపడే అలలు చాలా ప్రమాదకరం.ఈ అలలోని నీటి ఒత్తిడికి ఎముకలు కూడా విరిగిపోతాయి.
భారీ ఎత్తున అలలు వచ్చినప్పుడు చిన్నపాటి పడవల నుంచి ఓ మాదిరి సైజున్న నౌకల వరకు అన్నీ ధ్వంసం అయ్యే ప్రమాదం కూడా ఉంది.అలాంటి భయంకరమైన అలలు మధ్య సర్ఫింగ్ చేసేంత ధైర్యం ఎవరికీ ఉండదు అనుకుంటాం కదా.కానీ ఒక వ్యక్తికి అంతకు మించిన ధైర్యం ఉంది.అతడు ఏకంగా 86 అడుగుల ఎత్తులో ఎగిసిన ఒక అలపై సర్ఫింగ్ చేశాడు.
సాధారణంగా సముద్రంలో సర్పింగ్ చేయడమంటేనే ప్రాణాలతో చెలగాటం ఆడినంత రిస్కు.అలాంటిది ఈ జర్మన్ సర్ఫర్ సెబాస్టియన్ స్టెడ్‌నర్ 26.21 మీ (86 అడుగులు) అలపై సర్ఫింగ్ అందరూ నోరెళ్లబెట్టేలా చేశాడు.ఈ సాహసి మహా సముద్రంలో భారీ అలపై సర్ఫింగ్ చేసి ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టాడు.
అంతేకాదు గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్నాడు.గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ యాజమాన్యం ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను షేర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది.
ఇప్పుడా వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.సెబాస్టియన్ స్టెడ్‌నర్ (37) అక్టోబర్ 2020లో పోర్చుగల్‌లోని నాజారేలోగల ప్రియా డో నోర్టే సముద్రతీరంలో ఒక పెద్ద భారీ అలపై సర్ఫ్ చేశాడు.అయితే ఇలా సర్ఫింగ్ చేయడం ద్వారా అతడు రైడ్ 2021 రెడ్ బుల్ బిగ్ వేవ్ అవార్డుల్లో బిగ్గెస్ట్ టో అవార్డును సొంతం చేసుకున్నాడు.
అయితే తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కి కెక్కి బాగా పాపులర్ అయ్యాడు.ఈ వీడియోను నాలుగు లక్షల మంది వీక్షించారు.22వేల లైక్స్ వచ్చాయి.