మనకు దాదాపుగా ఈ ప్రపంచంలో ఉన్న అన్ని రకాల విషపూరితమైన పాముల( Poisonous Snakes ) గురించి తెలుసు.అయితే ఈ రోజు మనం పాము కంటే విషపూరితమైన జంతువు గురించి తెలుసుకోబోతున్నాం.
ఇది పాము కంటే 100 శాతం ఎక్కువ విషపూరితమైనదని నిపుణులు చెబుతున్నారు.అయితే ఇలాంటి జంతువులు 300 సంవత్సరాల క్రితం ఉండేవని, ప్రస్తుతం కొన్ని చోట్ల తప్పితే అంతటా మనుగడలో లేవని తెలుస్తోంది.
ఇంకా ఇవి విషం చిమ్మితే ఏ జంతువైన మరిణించడం ఖాయమని, వీటికి దూరంగా ఉండడమే మేలని నిపుణులు చెబుతున్నారు.

అవేమిటంటే నత్త జాతికి చెందిన “భౌగోళిక కోన్.”( Geographic Cone Snail ) ఇవి చూడడానికి చిన్నగా ఉన్నప్పటికీ హానికరమైన విషాన్ని చిమ్మే శక్తిని కలిగి ఉంటాయని, ఏ జాతి జంతువునైన వాటిపై సులభంగా విషాన్ని చిమ్మి దాడి చేస్తాయని పరిశోధకులు అంటున్నారు.ఐతే ప్రస్తుతం భౌగోళిక కోన్ ఇండో – పసిఫిక్ మహాసముద్రంలో( Indo – Pacific Ocean ) నివసిస్తున్నాయని కనుగొన్నారు.
ఈ హానికరమైన నత్తల నివసించే చోట ఇతర జంతువులు జీవించలేవట.ఒకవేళ జీవించిన అవి తొందరగానే మరణిస్తాయని నిపుణుల మాట.ఇతర జంతువులు భౌగోళిక కోన్‌పై దాడి చేసినప్పుడు తనను తాను వాటి నుంచి రక్షించుకునేందు విషం చిమ్ముతుంది.దీని కారణంగా దాడి చేయడానికి వచ్చిన జంతువులు రెప్పపాటు సమయంలోనే ప్రాణాలు కోల్పోతాయి.

భౌగోళిక కోన్ నత్త అనే జీవి తన శరీరంలోని పది అవయవాల నుంచి ప్రాణాంతకమైన విషాన్ని విడుదల చేస్తుందని తెలుస్తోంది.ఇది మానవులను, ఇతర జంతువులను చంపడానికి చురుగ్గా ఉంటుందని కూడా నిపుణులు చెబుతున్నారు.ఇండో – పసిఫిక్ మహా సముద్రంలో దగ్గర నివసించే వారంతా వీటి విషయం బారిన పడకుండా ఉండడానికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారని వినికిడి.ముఖ్యంగా సముద్రంలో వేటకు వెళ్లేవారు చేతులకు, కాళ్లకు తొడగులు వినియోగిస్తారని సమాచారం.
కాబట్టి మీరు నత్త కదాని చిన్నచూపు చూస్తే దాని పవర్ చూపిస్తుంది జాగ్రత్త!