టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమా లు కొన్ని ఇప్పటికే రీమేక్ అయ్యాయి, మరి కొన్ని రీమేక్ అవ్వబోతున్నాయి.ఆ జాబితాలోనే జాతి రత్నాలు మరియు గీతా గోవిందం సినిమాలు రీమేక్ అవ్వబోతున్నాయి అంటూ ప్రచారం జరిగింది.
కానీ ఈ రెండు సినిమాలు రీమేక్ సాధ్యం కాదు అనే ప్రచారం కొత్తగా మొదలైంది.ఆ మధ్య విజయ్ దేవరకొండ హీరో గా పరశురామ్ దర్శకత్వం లో దిల్ రాజు నిర్మాణం లో ఒక సినిమా ప్రకటన వచ్చింది.
అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తోంది.విజయ్ దేవరకొండ తో పరశురాం చేయాలనుకున్న సినిమా గీతా గోవిందం సినిమాకి సీక్వెల్ అనే ప్రచారం జరుగుతుంది.
అల్లు అరవింద్ రంగం లోకి దిగి ఆ సీక్వెల్ ని అడ్డుకున్నాడని ప్రచారం జోరుగా సాగుతోంది.

ఆ విషయం పక్కన పెడితే జాతి రత్నాలు సినిమా సీక్వెల్ విషయం లో మొన్నటి వరకు ఆసక్తిగా ఉన్న నిర్మాత మరియు హీరో ఇప్పుడు పెద్దగా ఆసక్తి కనపరచడం లేదని తెలుస్తోంది.ఎందుకంటే దర్శకుడు అనుదీప్ గత చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.అందుకే ఆయన తో మళ్ళీ సినిమా చేయడం అది కూడా జాతి రత్నాలు వంటి మంచి సినిమా ను సీక్వెల్ చేయడం కరెక్ట్ కాదు అంటూ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట.

దీంతో గీతా గోవిందం మరియు జాతి రత్నాలు రెండు సినిమాలకు కూడా సీక్వెల్ లేదనే విషయంపై క్లారిటీ వచ్చినట్లే అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది.భవిష్యత్తులో కూడా ఈ రెండు సినిమాలకు సీక్వెల్స్ వస్తాయా అంటే అనుమానమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.ప్రేక్షకులు ఈ రెండు సినిమాల యొక్క సీక్వెల్స్ కోసం వెయిట్ చేయక పోవడం మంచిదనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది.







