బిగ్ బాస్ ( Bigg Boss ) సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా పాల్గొన్నటువంటి వారిలో గౌతం కృష్ణ ( Gautham Krishna )ఒకరు.అదే విధంగా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి వారిలో బుల్లితెర నటుడు అర్జున్ అంబటి ( Arjun Ambati ) ఒకరు.
ఇలా వీరంతా బిగ్ బాస్ హౌస్ లో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.ఇక బిగ్ బాస్ తర్వాత సెలబ్రిటీలు అందరూ కూడా ఎక్కడ ఏ కార్యక్రమంలో పాల్గొనలేదు.
ఈ క్రమంలోనే స్టార్ మా వీరందరిని ఒకే చోట చేరుస్తూ బీబీ ఉత్సవ్( BB Utsavam ) అనే పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కాబోతోంది తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఓ ప్రోమో విడుదల చేశారు.

ఇందులో భాగంగా గౌతమ్ కృష్ణ అర్జున్ అంబటి కూతురికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.ఇటీవల అర్జున్ భార్య సురేఖ( Surekha ) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈ విషయాన్ని అర్జున్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.ఇక అర్జున్ కూతురిని చూడటం కోసం పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా వెళ్లారు.అయితే తాజాగా గౌతమ్ కృష్ణ అర్జున్ కుమార్తె కోసం వెండి పట్టీలు తీసుకువచ్చారు.ఇలా తన కుమార్తె కోసం తెచ్చిన గిఫ్ట్ ఇవ్వడంతో అర్జున్ సంతోషం వ్యక్తం చేశాడు.

ఇక అర్జున్( Arjun ) తన కుమార్తె గురించి మాట్లాడుతూ.పాప పుట్టగానే మొదట నేను నా చేతుల్లోకి తీసుకున్నాను.ఆ క్షణం పాప పెద్దగా కళ్ళు తెరిచి నన్ను చూసిందని అప్పుడే తనకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలి అనుకున్నాను అంటూ ఈ సందర్భంగా తన కుమార్తె గురించి చెబుతూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.అర్జున్ బిగ్ బాస్ లో ఉన్నప్పటికీ తన భార్య సురేఖ ప్రెగ్నెంట్ ఫ్యామిలీ వీక్ లో భాగంగా సురేఖ తన భర్త కోసం వచ్చినప్పుడు బిగ్ బాస్ తనకు సీమంతం కూడా నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.







