సినిమా ఇండస్ట్రీలో ఒక్కో డైరెక్టర్ కు ఒక్కో స్టైల్ ఉంటుంది.ఇక అందులో భాగంగానే గౌతమ్ వాసుదేవ్ మీనన్ కి( Gautam Vasudev Menon ) కూడా ఒక సపరేట్ స్టైల్ ఉంటుంది.
ఆయన లవ్ స్టోరీస్ చేసిన, గ్యాంగ్ స్టార్ మూవీస్ చేసిన ఏ మూవీ చేసిన కూడా అందులో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.ఆయన ఏ సినిమా చేసిన కూడా అందులో 100% ఎఫర్ట్ పెట్టీ చేస్తూ ఉంటాడు.
అందుకే గౌతమ్ వాసుదేవ్ మీనన్ సినిమా అంటే తెలుగు, తమిళ్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉంటాయి.ఇక ఆయన రీసెంట్ గా చియన్ విక్రమ్ ని( Chiyaan Vikram ) హీరోగా పెట్టి తెలుగులో ధృవ నక్షత్రం( Dhruva Nakshatram ) పేరుతో ఒక సినిమా ని రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమా నవంబర్ 24 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే ఈ సినిమాలో విలన్ గా జైలర్ ( Jailer ) మూవీతో ఫేమస్ అయిన వినాయకన్ ని తీసుకోవడం జరిగింది.
అయితే వినాయకన్ తో( Vinayakan ) నటింపజేయడం కష్టమైన పని అని తెలుస్తుంది.ఎందుకంటే ఆయన మనం చెప్పినట్టుగా చేయడు ఆయనకు నచ్చినట్టుగానే చేస్తాడు.మళ్లీ ప్రతిదీ కూడా ఆయనకి క్లియర్ గా చెప్తూ ఉండాలంటా అవన్నీ క్లియర్ గా ఉంటేనే ఆయన నటిస్తాడటా లేకపోతే ఆయనని హ్యాండిల్ చేయడం కష్టం అని తెలుస్తుంది… ఇక అందులో భాగంగానే ఒక రోజు షూట్ లో గౌతమ్ మీనన్ కి, తనకి మధ్య గొడవ జరిగినట్టు గా కూడా తెలుస్తుంది.
ఎందుకంటే ఒకరోజు ఒక సీన్ షూట్ చేసే టైంలో వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది.మళ్లీ ఆ తర్వాత ఇద్దరు కూడా కలిసి పోయి మాట్లాడుకుంటూ వర్క్ లో బిజీ అయిపోయినట్టుగా తెలుస్తుంది…అయితే ఈ సినిమాతో వినాయకన్ విలన్ గా మరో మెట్టు పైకి ఎదుగుతాడు అని మూవీ టీమ్ భావిస్తున్నారు…
.