జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వాలంటీర్ల వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.పవన్ చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడం జరిగింది.
మరోపక్క పవన్ మాత్రం వాలెంటైర్ల వ్యవస్థ పై( Volunteer System ) మాటలు దాడి పెంచుతూనే ఉన్నారు.ప్రజల నుండి వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం ఎక్కడికి వెళుతుంది.? రాజ్యాంగ వ్యతిరేకంగా కొత్త వ్యవస్థలను నిర్మించుకున్నారు.ప్రజల వ్యక్తిగత జీవితాలు వాలంటీర్లకు ఎందుకు.? అదృశ్యమైన ఆడబిడ్డల పరిస్థితి గురించి ఆలోచన చేయాలి.? అని పవన్ నిలదీయడం జరిగింది.

ఈ క్రమంలో పవన్ వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్యే మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు( Ganta Srinivasa Rao ) మద్దతు తెలిపారు.వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలలో అభ్యంతరకర వ్యాఖ్యలు లేవని మండిపడ్డారు.వాలంటీర్లకు వ్యవస్థలో జరుగుతున్న లోపాలను మాత్రమే పవన్ ఎత్తి చూపరని చెప్పుకొచ్చారు.అంతే తప్ప వాలంటీర్లు తప్పు చేస్తున్నారని పవన్ అనలేదని అన్నారు.లోకేష్ పాదయాత్రకి మద్దతుగా విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెంలో టీడీపీ నేతలు ర్యాలీ చేపట్టడం జరిగింది.ఈ ర్యాలీలో గంటా శ్రీనివాసరావు పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.







