ఇటీవలే కాలంలో తాళం వేసి ఉన్న ఇండ్లను, షాపులను టార్గెట్ చేసి దోపిడీకి పాల్పడే దొంగల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతుంది.ఈ క్రమంలోనే ఒకవైపు గణేష్ నిమజ్జనం శోభయాత్ర( Ganesh Nimajjanam Shobhayatra ) జరుగుతుంటే.
ఇదే మంచి అవకాశం అని భావించిన దొంగలు రెండు వైన్ షాపులలో చోరీ చేసి తమ చేతివాటాన్ని చూపించారు.ఈ దొంగతన ఘటన వికారాబాద్ జిల్లాలోని బషీరాబాద్( Basheerabad in Vikarabad ) లో చోటుచేసుకుంది.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
బషీరాబాద్ లో రేకుల షెడ్డులో ఉండే శ్రీ మణికంఠ వైన్స్, వినాయక వైన్స్ షాపుల్లో గుర్తు తెలియని కొందరు దొంగలు అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు.షాపు పైనుండి రేకులను నెమ్మదిగా తొలగించి రూ.95 వేలకు పైగా నగదును దోచుకుని పరారయ్యారు.ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు పక్కనే ఉన్న సీసీటీవీ కెమెరాలలో రికార్డు అయింది.

ఉదయం ఆ రెండు షాపుల యజమానులు షాపులు తెరిచేందుకు వచ్చి తాళం తెరిచి చూడగా పైన రేకులు తెరిచి ఉండడంతో దొంగలు పడ్డట్టుగా గుర్తించారు.వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి పక్కనే ఉన్న సీసీ కెమెరాలలో రికార్డు అయిన దృశ్యాలను స్వాధీనం చేసుకున్నారు.ఆ సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దొంగలను పట్టుకునేందుకు తమ వేట ప్రారంభించారు.ఈ చోరీ ఘటనపై స్పందించిన ఎస్సై వేణుగోపాల్ రెడ్డి( SI Venugopal Reddy ) సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ.
బషీరాబాద్ మండల కేంద్రంలోని రెండు వైన్ షాపులలో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారని, షాప్ యజమానులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.