విశాఖలో గాజువాక వస్త్ర ప్రేమికుల కోసం గాజువాక కూర్మన్నపాలెం 38 బస్ స్టాప్ వెనక సువిశాలమైన ప్రాంతంలో వినూత్న సిల్క్స్ షోరూంను ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిధిగా గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి పాల్గొని షోరూంను ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ వస్త్ర ప్రేమికులకోసం తమ నియోజకవర్గంలో వినూత్న సిల్క్స్ షోరూంను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు.వినూత్న సిల్క్స్ యజమాని మాచర్ల వేణుగోపాల్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా మహిళలు మనసుదోచే అన్ని రకాల చీరలు నాణ్యమైన ధరలలో అందుబాటులో ఉంచామని తెలిపారు.
ముఖ్యంగా మగ్గం ద్వారా నేచే చీరలు తమ ప్రత్యేకతన్నారు.ఈ కార్యక్రమంలో 86,87 కార్పొరేటర్లు లేళ్ళ కోటేశ్వరరావు, బొండా జగన్, టీడీపీ సీనియర్ నాయకులు పప్పు రాజారావు స్థానిక ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.







