ఏకంగా కుమార్తెను శ్రీవారి సేవకు అంకితం చేసిన రాజు ఎవరో తెలుసా?

కలియుగ దైవమైన శ్రీవెంకటేశ్వరస్వామి వారిని ముస్లిం మతస్థులు తమ ఇంటి అల్లుడుగా భావిస్తారు.

ఈ సమయంలోనే ముస్లింలు పెద్ద ఎత్తున వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించి పూజలు చేస్తుంటారనే విషయం మనందరికీ తెలిసిందే.

కానీ భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన వివిధ ఆలయాలను కూల్చేసిన గజిని మహమ్మద్ రాజు కళ్ళు తెరిపించి తన అపరాధాన్ని తనకు తెలియజెప్పినది కూడా సాక్షాత్తు శ్రీవారే.అయితే గజిని మహమ్మద్ చేసిన తప్పులు ఏమిటి? ఈ రాజు తన కూతురిని స్వామివారి సేవకు అంకితం చేయడానికి గల కారణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.పూర్వకాలం గజిని మహమ్మద్ కు కూతురు జన్మించి ఎంతో అందంగా ఉండేది.

ఆమె యుక్త వయసు రాగానే కన్యాంత:పురానికి రాజభటులు చాలా జాగ్రత్తగా కావలి కాస్తుండేవారు.ఆమె కన్యత్వాన్ని కాపాడటం కోసం రాజభటులు రాత్రివేళ్లలో ఒక్క నిమిషం కూడా నిద్రించే వారు కాదు.

ఈ సమయంలోనే ఒక రోజు అర్ధరాత్రి సమయంలో వెంకటేశ్వర స్వామి అంతఃపురంలోకి ప్రవేశించి నిద్రిస్తున్న సుల్తాన్ కూతురిని లేపి.తన గురించి అన్ని విషయాలను చెప్పాడు.

Advertisement
Gajini Mohammed Who Dedicated His Daughter To The Service Of Sri Venkateswara Sw

రాజకుమార్తె సాక్షాత్తు శ్రీ వారిని మానవ రూపంలో చూసేసరికి ముగ్ధురాలైంది.ఈ విధంగా తనని కలవడానికి వచ్చిన సంగతి బయట ఎక్కడ చెప్పకూడదని అతడు చెప్పడంతో అందుకు రాజు కుమార్తె కూడా అంగీకరించింది.

ఈ విధంగా అంతఃపురంలోకి వ్యక్తి ప్రవేశించే తతంగం మొత్తం ఒక కావలి చూసి ఈ విషయాన్ని వెంటనే రాజు కి తెలియజేస్తారు.

Gajini Mohammed Who Dedicated His Daughter To The Service Of Sri Venkateswara Sw

ఎంతో కోపోద్రిక్తుడైనా మహమ్మద్ వెంటనే తన కూతురు దగ్గరకు వెళ్లి "నీ దగ్గరకు వస్తున్న ఆ పురుషుడు ఎవరో చెప్పు’’ అని ఆమెను నిర్బంధించిన ఆమె నోరు మెదపక పోవటంతో ఎంతోఆగ్రహం చెందిన మహమ్మద్ పక్కనే ఉన్న ఖడ్గం తీసి తన కూతురి శిరస్సును ఖండించి అక్కడే విగ్రహ రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి మానవ రూపంలో ప్రత్యక్షమై.ఓయీ మహ్మదూ! ఆనాడు నువ్వు బలాత్కారంతో నా వరాన్ని పొందావు.ఇది సాధుమార్గం కాకపోవడం వల్ల నువ్వు స్వధర్మ భ్రష్ఠుడివై నువ్వు రాజువయ్యావు ఇంకా నీకు అజ్ఞానం తొలగలేదా ఒకప్పుడు నువ్వు ఆచరించిన హిందూ ధర్మానికి కూలద్రోయటానికి ప్రయత్నిస్తున్నావు.

మతాలు వేరైనా దైవం ఒక్కటేనని గ్రహించలేకపోతున్నారు అని శ్రీవారు తెలపడంతో కళ్ళు తెరుచుకున్న మహమ్మద్ వెంటనే తాను చేసిన పనికి ప్రాయశ్చిత్తం చేయాలని భావించాడు.తన అంతఃపురం ముందు ఎంతో మంది అర్చకులు తమకు ఉపాధి కల్పించాలని వేడుకుంటున్నారు.

Gajini Mohammed Who Dedicated His Daughter To The Service Of Sri Venkateswara Sw
పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

ఈ క్రమంలోనే తను కూలగొట్టిన ఆలయాలను తిరిగి నిర్మించాలని భావించి అర్చకులు అందరినీ పిలిచి వారికి కావలసిన ధనం ఇచ్చి ఆలయాలను నిర్మించాలని వేడుకున్నారు.ఈ విధంగా అందరి అర్చకులకు తగినంత ధనం ఇచ్చి పంపగా చివరకు తిరుపతి అర్చకులు రాజుగారి దగ్గరకు వచ్చి మేము కూడా వెంకటేశ్వర స్వామి అర్చకులమని,మాకు కూడా దేవుడి విగ్రహం ఇచ్చి పంపించాలని అర్చకులు కోరగా అందుకు మహమ్మద్ అక్కడే ఉన్నటువంటి వెంకటేశ్వర విగ్రహాన్ని ఇచ్చి పంపడమే కాకుండా తనకు కనువిప్పు కలిగించిన స్వామి వారికి సేవ చేయడం కోసం తను ఎంతో అపురూపంగా చూసుకుంటున్న కుమార్తెను కూడా అర్చకుల వెంట పంపారనీ పురాణాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు