వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రజా గాయకుడు గద్దర్ గురువారం వెల్లడించారు.ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ.
తాను ఏ పార్టీకీ చెందినవాడిని కాదని, రాహుల్, సోనియాలను కలవడం వెనుక రాజకీయ ఉద్దేశమేమీ లేదని తెలిపారు.ఇటీవల ఢిల్లీలో సిఐడి అడిషనల్ డిజిని కలిసి తనకు భద్రత కల్పించాలని కోరానని చెప్పారు.
అవినీతి కంటే రాజకీయ అవినీతి చాలా ప్రమాదకరమన్న గద్దర్.ఈ నెల 15 నుంచి తెలంగాణలో పల్లెపల్లెకు వెళతానని పేర్కొన్నారు.

కాగా కేసీఆర్ మెదక్ జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ పార్టీ తరుపున పోటిచేస్తున్న విషయం తెలిసిందే.కాగా ప్రస్తుతం గద్దర్ తాను కూడా ఇండిపెండెంట్ గా కేసీఆర్ పై పోటీకి దిగుతున్నట్లు ప్రకటించారు.