దేశ రాజధాని ఢిల్లీలో జీ20 సమ్మిట్ సందడి నెలకొంది.ఈ సదస్సుకు ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.
పోలీసులు, భద్రతా బలగాలు పహారా కాస్తుండగా ఢిల్లీ రూపురేఖలే మారిపోయాయి.రేపు ప్రగతిమైదాన్ భారత్ మండపంలో జీ20 సమ్మిట్ జరగనున్న విషయం తెలిసిందే.
అంతర్జాతీయ ఆర్థిక అంశాలతో పాటు సుస్థిర అభివృద్ధి, భవిష్యత్ లక్ష్యాలపై ఇందులో కీలక తీర్మానాలు చేయనున్నారు.అనంతరం వచ్చే సంవత్సరం జీ20 సమ్మిట్ జరగనున్న బ్రెజిల్ కు ప్రెసిడెన్సీని భారత్ అప్పగించనుంది.
మరోవైపు రేపు రాత్రి భారత మండపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీ20 ప్రతినిధులకు విందు ఇవ్వనున్నారు.
.






