ఢిల్లీలోని యమునా నదిలో వరద ఉధృతి మరింతగా పెరిగింది.నదీ ప్రవాహం హెచ్చరిక స్థాయి 204.50 మీటర్లను మించి ప్రవాహిస్తుంది.ఢిల్లీలోని పాత రైల్వే వంతెన వద్ద మధ్యాహ్నం 3 గంటలకు యమునా నీటిమట్టం 205.10 గా కొనసాగుతోంది.హత్నీకుండ్ నుంచి విడుదల చేసిన నీరుతో పాటు వర్షపు నీరు కారణంగా నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.
కాగా ఢిల్లీలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో అప్రమత్తమైన ప్రభుత్వం వరద పరిస్థితులపై 16 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసింది.క్విక్ రెస్పాన్స్ టీమ్స్, రెస్క్యూ బోట్లను సిద్ధంగా ఉంచింది.