బ్రహ్మానందం కామెడీ చేస్తే ఎవరు నవ్వలేదట.. ఎప్పుడో తెలుసా ?

బ్రహ్మానందం సినిమా పరిశ్రమలో ఆయన గురించి తెలియని వారుండరు. తెలుగు రాష్ట్రాల జనాల్లతో ఆయనంటే గుర్తుపట్టని వ్యక్తులుండరు.

తన కామెడీతో జనాలను నవ్వుల్లో ముంచేసిన నటుడు ఆయన.బ్రహ్మానందం సినిమాల్లోకి రాకముందు అత్తిలి డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా పనిచేశాడు.తెలుగు బోధించేవాడు.

అప్పటికే తనకు మిమిక్రీ కళమీద మంచి పట్టుంది.మంచి మిమిక్రీ ఆర్టిస్టుగా గుర్తింపు పొందాడు కూడా.

ఓసారి అదే ఊరిలో మిమిక్రీ ప్రదర్శన ఇచ్చాడు.ఆయన హాస్యానికి జనాలు విరగబడి నవ్వారు.

Advertisement
Funny Incident In Actor Brahmanandam Mimicry Show, Tollywood , Brahma Nandam , C

విపరీతంగా కేరింతలు కొడుతున్నారు.వాళ్లు నవ్వుతుంటే తన సంతోషం మరింతగా పెరిగింది.

మరీ మరీ నవ్విస్తున్నాడు.ఆ ప్రాంతమంతా నవ్వులతో నిండిపోయింది.

అక్కడే ఓ విచిత్ర ఘటన జరిగింది.ఇంతకీ అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జనాలు విపరీతంగా నవ్వుతున్న సమయంలో అక్కడికి ఆ ఊరి ప్రెసిడెంట్ వచ్చాడు.ఆపండి అంటూ గట్టిగా కేక వేశాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

బ్రహ్మానందం తన ప్రోగ్రాం ఆపేశాడు.జనాలంతా సైలెంట్ అయ్యారు.

Funny Incident In Actor Brahmanandam Mimicry Show, Tollywood , Brahma Nandam , C
Advertisement

చడీ చప్పుడూ లేదు.బ్రహ్మానందం ఏం జరిగిందో తెలియక అయోమయంలో పడ్డాడు.ఇంతలో ప్రెసిడెంట్ అందుకున్నాడు.

ఆయన ఎవరు అనుకున్నారు? మన ఊరి కాలేజీ లెక్చరర్.ఆయనను చూస్తే నవ్వులాటగా ఉందా? ఇంకెప్పుడూ నవ్వొద్దు.మరోసారి ఎవరు నవ్వినా చంపేస్తాను అంటూ హెచ్చరించాడు.

బ్రహ్మానందంను చూసి మీరు కానివ్వండి మాస్టారూ అన్నాడు.

బ్రహ్మానందం మళ్లీ తన మిమిక్రీ ప్రోగ్రాం కొనసాగించాడు.అక్కడి జనాలను నవ్వించేందుకు ఎంతో ప్రయత్నించాడు.అయినా వాళ్ల ముఖాలలో నవ్వు కనిపించలేదు.

అయినా వాళ్లను నవ్వించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు.జనాలు లోలోపన నవ్వుతున్నారు.

నోరు మూసుకుని కూర్చున్నారు తప్ప బయటకు ఎవ్వరూ నవ్వలేదు.తన జీవితంలో బ్రహ్మానందం చాలా చోట్ల చాలా మిమిక్రీ ప్రదర్శనలు ఇచ్చాడు.

కానీ ఎక్కడా జనాలు నవ్వకుండా ఉండలేదు.ఒక్క అత్తిలిలో తప్ప.

ఈ ఘటన గుర్తుకు వచ్చినప్పుడు తనకు నవ్వొస్తుంది అంటాడు బ్రహ్మానందం.నవ్వుల ప్రొగ్రాంలో నవ్వకూడదని చెప్పడం ఏంటోనని ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నాడు నవ్వుల రారాజు బ్రహ్మానందం.

తాజా వార్తలు