తల్లి తండ్రులు వద్దనుకున్నారో, లేదంటే ఎవరైనా ఎత్తుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయారో కానీ విధి వక్రించడంతో ఓ బాలుడు అనాధగా మారిపోయాడు.
ఓ స్వచ్చంద సంస్థ ఆ బాలుడిని తమ వద్దకు తీసుకువచ్చి సాకుతోంది.
ఈ క్రమంలో ఊహించని విధంగా సదరు బాలుడు మాకు కాలంటూ తాము పెంచుకుంటామని తమతో అమెరికా తీసుకువెళ్ళి మంచి భవిష్యత్తు అందిస్తామని ముందుకొచ్చారు.దాంతో అనాధ నుంచీ అమెరికా వాసి కాబోతున్నాడు భారత్ కు చెందిన బాలుడు.
ఈ కదిలించే కధ లో మరింత లోతుగా వెళ్తే.బీహార్ రాష్ట్రంలో మూడేళ్ళ క్రితం ఓ ఘటన చోటు చేసుకుంది.
నలందా ప్రాంతంలో నెలల వయసున్న పిల్లాడిని గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్ళిపోయారు.పిల్లాడు ఆకలితో ఏడవడం చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గుండె కరిగిపోయింది.
పిల్లాడి ఆకలి తీర్చారు కానీ వాడిని ఎవరు సాకుతారు అనే ప్రశ్న తలెత్తింది దాంతో దానాపూర్ కి చెందిన స్వచ్చంద సంస్థ ఆ పిల్లాడి భాద్యతలు తీసుకుంది.తమ శక్తి మేరకు పిల్లాడని జాగ్రత్తగా పెంచుతూ వచ్చారు.
అతడికి అర్జిత్ కుమార్ అనే పేరు కూడా పెట్టారు.పిల్లాడు దొరికనప్పటి నుంచీ వాడి తల్లి తండ్రుల కోసం వెదుకుతూనే ఉన్నారు.
అయిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.ఇదిలాఉంటే.
అర్జిత్ కుమార్ ను తాము పెంచుకుంటామని మాకు దత్తతు ఇవ్వండని దానాపూర్ స్వచ్చంద సంస్థకు అమెరికా నుంచీ దంపతులు సంప్రదించారు.మొదట్లో వారు ఈ విషయాన్ని నమ్మలేక పోయారు కానీ పదేపదే వారు సంప్రదించడంతో సంస్థ సరేనని ఒప్పుకుంది.ఈ విషయాన్ని అక్కడి సబ్ డివిజినల్ అధికారికి చెప్పడంతో వారు సరే నని ఇక్కడ పెరిగిన పిల్లాడు అమెరికాలో స్థిరపడితే సంతోషమే కదానని ఒప్పుకోవడంతో సంస్థ అమెరికన్స్ కు పిల్లాడిని దత్తతు ఇవ్వడానికి ఒప్పుఉంది.
దాంతో వారు బీహార్ లోని దానాపూర్ కు వచ్చి అర్జిత్ కుమార్ ను దత్తతు తీసుకోవడానికి అన్ని అనుమతులతో కూడిన దరఖాస్తులు సమర్పించారు.అర్జిత్ కుమార్ ను తీసుకువేళ్ళెందుకు పాస్ పోర్ట్ ను కూడా సిద్దం చేసుకుంటున్నారు.
త్వరలో అర్జిత్ ను తమతో పాటు తీసుకువెళ్ళి మంచి భవిష్యత్తును అందిస్తామని అంటున్నారు ఈ అమెరికన్ దంపతులు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy