మంత్రుల‌కు స్వేచ్ఛ‌... ఈట‌ల ఎఫెక్ట్ కార‌ణ‌మా..?

తెలంగాణ రాజ‌కీయాల్లో ప్ర‌స్తుతం అనేక ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఇందుకు ప్ర‌ధాన కార‌ణం ఈట‌ల రాజేంద‌ర్ వ్వ‌వ‌హారం.

ఈయ‌న వ్య‌వ‌హారానికి ముందు తెలంగాణ మంత్రుల‌కు పెద్ద‌గా ఇంపార్టెన్స్ లేద‌నే చెప్పాలి.రాష్ట్ర మంత్రులైన‌ప్ప‌టికీ కేవలం వారి నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమిత‌మ‌య్యేవారు.

మంత్రి హ‌రీశ్‌రావులాంటి కీల‌క నేత కూడా సిద్దిపేట‌కే అంకిత‌మ‌య్యారు.కానీ ఎప్పుడైతే ఈట‌ల రాజేంద‌ర్ మంత్రుల‌కు స్వేచ్ఛ లేద‌ని చెప్పాడో అప్ప‌టి నుంచి మార్పులు వ‌చ్చాయి.

మంత్రుల‌కు స్వేచ్ఛ లేద‌ని ఈట‌ల వ్యాఖ్య‌ల‌తో వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని కేసీఆర్‌, కేటీఆర్ అల‌ర్ట్ అయ్యారు.మంత్రుల‌కు మ‌ళ్లీ కొంత స్వేచ్ఛ ఇస్తున్నారు.

Advertisement

రాష్ట్ర వ్యాప్తంగా త‌మ శాఖ‌ల‌కు సంబంధించిన ప‌నుల్లో భాగ‌స్వామ్యం అవుతున్నారు.ఈ నేప‌థ్యంలోనే ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల‌కు కూడా వెళ్లి శంకుస్థాప‌న‌లు చేస్తున్నారు.

ఇంకొంద‌రుమంత్రుల‌ను కేటీఆర్ ద‌గ్గ‌రుండి మ‌రీ ఆయ‌న వెంట తీసుకెళ్లి వివిధ కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేలా చూస్తున్నారు.చాలామందిని వెంట ప‌ట్టుకెల్లి మ‌రీ శంకుస్థాప‌న‌లు, ఓపెనింగ్‌లు చేయిస్తున్నారు మంత్రి కేటీఆర్‌.

ఈ మార్పు ఇప్పుడు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.మొత్తానికి ఈట‌ల రాజేంద‌ర్ వ్య‌వ‌హారం ఏమోగానీ టీఆర్ ఎస్ మంత్రుల‌కు మాత్రం స్వేచ్ఛ విష‌యంలో బాగానే క‌లిసి వ‌చ్చింద‌నే చెప్పాలి.

కాక‌పోతే ఈ స్వేచ్ఛ ఎంత‌వ‌ర‌కు ఉంటుంద‌నేది తెలియ‌దు.కొద్ది రోజులు చూసిన త‌ర్వాత మ‌ళ్లీ పాత సీన్ తెర‌మీద‌కు వ‌స్తుంద‌నే అనుమానాలు కూడా ఉన్నాయి.అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక పూర్త‌య్యేవ‌ర‌కు మంత్రుల‌కు ఈ స్వేచ్చ ఉంటుంద‌ని తెలుస్తోంది.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

ఆ త‌ర్వాత ఎలా ఉంటుందో చూడాలి.కాక‌పోతే ఇప్పుడు మాత్రం వ‌రుస మీటింగులు పెడుతున్నారు మంత్రులు.

Advertisement

కొన్నిర‌కాల హామీలు కూడా ఇస్తున్నారు.ఈ విధ‌మైన మార్పు చాలా ముఖ్య‌మ‌నే చెప్పాలి.

ఎందుకంటే ఇలా ఉంటేనే ప్ర‌భుత్వ పాల‌న ప్ర‌జ‌ల‌కు చేరువ‌వుతుంది.కాక‌పోతే కేసీఆర్ ఏది చేసినా బాగా ముందుచూపుతోనే చేస్తారు.

మ‌రి ఆయ‌న వ్యూహం ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి.

తాజా వార్తలు