మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది కేంద్రం యొక్క ఎన్నికల మోసపూరిత హామీ అని ఎంపీ జైరాం రమేశ్ ఆరోపించారు.కోట్లాది భారతీయ మహిళలు, బాలికల ఆశలకు చేస్తున్న భారీ ద్రోహం అని తెలిపారు.
మోదీ ప్రభుత్వం 2021 జనాభా గణనను ఇంకా నిర్వహించలేదని జైరాం రమేశ్ పేర్కొన్నారు.జనాభా గణన ఎప్పుడు జరుగుతుందని ప్రశ్నించిన ఆయన 2024 ఎన్నికల లోపు జనాభా లెక్కలు, డీలిమిటేషన్ జరుగుతుందా అని ప్రశ్నించారు.
అంతేకాకుండా బిల్లు అమలు తేదీ గురించి స్పష్టత లేదని విమర్శించారు.అయితే కేంద్రం ఇవాళ లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
దీనిపై లోక్ సభలో రేపటి నుంచి చర్చ జరగనుండగా ఓటింగ్ అనంతరం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.







