ర‌క్త‌హీన‌త‌కు చెక్ పెట్టే కొర్ర‌లు..ఎలా తీసుకోవాలంటే?

ర‌క్త‌హీన‌త‌.ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ శాతం మందిని వేధిస్తున్న స‌మ‌స్యల్లో ఇది ఒక‌టి.

ముఖ్యంగా చిన్న పిల్ల‌లు, స్త్రీలే ర‌క్త హీన‌త బాధితుల్లో ఎక్కువ‌గా ఉంటున్నారు.ఆహార‌పు అల‌వాట్లు, మారిన జీవ‌న శైలి, పోష‌కాల లోపం, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ర‌క్త హీన‌త స‌మ‌స్య ఏర్పడుతుంది.

ఈ ర‌క్త హీన‌త‌ను నిర్ల‌క్ష్యం చేస్తే.క్ర‌మంగా ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు పోయే అవ‌కాశం ఉంది.

అందుకే ర‌క్త హీన‌త‌ను ఎప్పుడూ ద‌రి దాపుల్లోకి కూడా రానీయ‌కూడ‌ద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.ఇక ర‌క్త హీన‌త‌ను నివారించ‌డంలో కొన్ని కొన్ని ఆహారాలు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

Advertisement
Foxtail Millet Helps To Reduce Anemia! Foxtail Millet, Anemia, Blood, Increase B

అలాంటి వాటిలో కొర్ర‌లు కూడా ఒక‌టి.చిరుధాన్యాలుగా పిలువబడే కొర్రల‌ను చిన్న పిల్ల‌లు, పెద్ద‌లు, గ‌ర్భిణీ స్త్రీలు ఇలా అంద‌రూ తీసుకోవ‌చ్చు.

తీపి, వ‌గ‌రు రుచి క‌లగి ఉండే కొర‌ల్లో కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, ఐర‌న్‌, రైబోఫ్లేవిన్, ఫైబ‌ర్‌, విట‌మిన్ బి, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు నిండి ఉంటాయి.

Foxtail Millet Helps To Reduce Anemia Foxtail Millet, Anemia, Blood, Increase B

అందుకే కొర్ర‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ముఖ్యంగా ర‌క్త హీన‌తతో బాధ ప‌డే వారు కొర్ర‌ను డైట్‌లో చేర్చుకుంటే చాలా మంది.కొర్ర‌ల‌ను అన్నం మాదిరిగానే వండుకుని.

ఏదైనా కూర‌, పులుసు, ర‌సం వంటి వాటితో తీసుకోవాలి.రైస్‌కు బ‌దులుగా కొర్ర‌ల‌ను తీసుకుంటే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

వాటిలో పుష్క‌లంగా ఉంటే ఐర‌న్ మ‌రియు ఇత‌ర పోష‌కాలు ర‌క్త వృద్ధి జ‌రిగేలా చేస్తాయి.దాంతో ర‌క్త హీన‌త స‌మ‌స్య దూరం అవుతుంది.

Advertisement

ఇక కొర్ర‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌రిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.ముఖ్యంగా ఆల్జీమ‌ర్స్ వ్యాధి గ్ర‌స్తులు అన్నంకు బ‌దులు కొర్ర‌లు తీసుకుంటే మంచిది.

కొర్ర‌ల్లో ఉండే పోష‌కాలు మెద‌డు ప‌ని తీరును మెరుగుప‌రుస్తుంది.జ్ఞాప‌క శ‌క్తిని పెంచుతుంది.

బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు కూడా కొర్ర‌ల‌ను డైట్‌లో చేర్చుకుంటే.ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవ్వొచ్చు.

తాజా వార్తలు