ఒడిశాలో ఘోరం టీచర్ ఇచ్చిన పనిష్మెంట్ కి నాలుగో తరగతి విద్యార్థి మృతి..!!

సమాజంలో పరిస్థితులు చాలా దారుణంగా మారుతున్నాయి.ఏ రకంగా ఎవరి ప్రాణం పోతుందో ఎవరికి అర్థంకాని పరిస్థితి నెలకొంది.

చిన్న చిన్న విషయాలకు యువత ఆత్మహత్యలకు పాల్పడుతుంటే విద్యాసంస్థలలో అధ్యాపకులు ఇచ్చే పనిష్మెంట్ లకి విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవల ఎక్కువైపోతున్నాయి.తాజాగా ఈ రీతిగానే ఒడిశా రాష్ట్రంలో( Odisha ) నాలుగో తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.

Fourth Class Student Dies Due To Teacher Punishment In Odisha Fourth Class Stude

పూర్తి విషయంలోకి వెళ్తే ఒడిశా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలలో దారుణం జరిగింది.నాలుగో తరగతి విద్యార్థి చేత టీచర్ గుంజీలు తీయించడంతో సదరు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.

రుద్ర నారాయణ్( Rudra Narayan )(10) పాఠశాల జరుగుతున్న సమయంలోనే తోటి విద్యార్థులతో.టెర్రస్ పైకి వెళ్లడం జరిగింది.

Advertisement

ఈ క్రమంలో అక్కడ ఆడుకుంటూ టీచర్ కంట పడటంతో.వెంటనే గుంజీలు తీయాలని పనిష్మెంట్.

ఇవ్వటం జరిగింది.దీంతో సదరు నాలుగో తరగతి విద్యార్థి గుంజీలు తీస్తూ అక్కడికక్కడే కుప్పకూలాడు.

వెంటనే పాఠశాల సిబ్బంది అప్రమత్తమయ్యి ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది.ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.

కొడుకు చనిపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులకు కన్నీరు మున్నీరవుతున్నారు.ఇదే సమయంలో విద్యార్థి బంధువులు పాఠశాల వద్ద నిరసనలు తెలియజేయడం జరిగింది.

వామ్మో.. ఇంగువతో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా?
Advertisement

తాజా వార్తలు