ఫ‌లించిన ప్ర‌య‌త్నం... సుర‌క్షితంగా బ‌య‌ట‌కు ! ఇదీ బోరు బావి చిన్నారి క‌థ !

స‌ర‌దాగా ఆడుకుంటున్న చిన్నారులు బోరుబావుల్లో ప‌డితే .వ‌చ్చే ఆ ఆవేద‌న అంతా ఇంతా ఉండ‌దు.

వారు ప‌డే న‌ర‌క‌యాత‌న హృద‌యాల‌ను క‌లచివేస్తుంది.అలాంటి విషాధాలు నేడు నిత్య‌కృత్యంగా మారాయి.

పూడ్చ‌కుండా వ‌దిలేసిన బోరు బావుల్లో చిన్నారులు ప‌డి ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న‌లూ ఉన్నాయి.ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన విష‌యాల్లో కొన్ని విషాదాంతం మిగిలిస్తే మ‌రికొన్ని సుఖాంతం మిగిల్చినవి ఉన్నాయి.

తాజాగా ఓ ఘ‌ట‌న అంద‌రినీ నిర్ఘాంత‌పోయేలా చేసింది.ఓ పొలంలో స‌ర‌దాగా స్నేహితుల‌తో క‌లిసి ఆడుకుంటున్న ఓ చిన్నారి బోరుబావిలో ప్ర‌మాద‌వ‌శాత్తు ప‌డిపోయాడు.

Advertisement

విష‌యం తెలుసుకున్న వెంట‌నే స‌హాయ‌క బృందాలు 24 గంట‌లు శ్ర‌మించి బాలుడిని సుర‌క్షింతంగా బ‌య‌ట‌కు తీశారు.దీంతో అప్ప‌టి వ‌ర‌కు ఊపిరిబిగ‌ప‌ట్టుకున్న‌ట్టు నెల‌కొన్న వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా శాంతించిన‌ట్టు అయింది.

బాబు క్షేమంగా బ‌య‌ట‌ప‌డ‌డంతో కుటుంబీకులు, స్థానికులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.ఈ ఘ‌ట‌న రాజస్థాన్ లోని శిఖ‌ర్ జిల్లాలో చోటుచేసుకుంది.

అస‌లేం జ‌రిగిందంటే .నాలుగున్న‌రేండ్ల వ‌య‌సు ఉన్న ఓ బాలుడు ప్ర‌మాద‌వ‌శాత్తు బోరుబావిలో ప‌డిపోయాడు.బాలుడి ఏడుపు విన్న స్థానికులు అక్క‌డికి వెళ్లి చిన్నారిని వెలికి తీసేందుకు విఫ‌ల‌య‌త్నం చేశారు.అయినా ఫ‌లితం ద‌క్క‌క‌పోవ‌డంతో అధికారుల‌కు స‌మాచారం చేర‌వేశారు.

దీంతో పోలీసులు, అధికారులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

శోభన్ బాబు కలర్ గురించి జయలలిత తల్లి అలా అన్నారా.. అసలేం జరిగిందంటే?
ఇండియాలోనే అతిపెద్ద ట్రక్కు.. దీనికి ఎన్ని చక్రాలు ఉన్నాయో తెలిస్తే..

కాగా బాలుడు జారి ప‌డిపోయిన బోరుబావి 50 అడుగుల లోతు ఉంటుంద‌ని అధికారులు వెల్ల‌డించారు.ఆ బాలుడిని స‌హాయ‌క బృందాలు, అధికారులు బాబును బ‌య‌ట‌కు తీశారు.ఎస్‌డీఆర్ఎఫ్‌, డీఆర్ఎఫ్‌, ఎన్‌డీఆర్ెఫ్ బృందాలు సుమారు 24గంట‌ల‌కు పైగా శ్ర‌మించి బాలుడిని బోరు బావి నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీశారు.

Advertisement

పూడ్చ‌ని బోరు బావికి స‌మాంతరంగా ఓ సొర‌గం చేసి బాలుడిని ప్రాణాల‌తో బ‌య‌ట‌కు తీసుకొచ్చారు.ఈ ఆప‌రేష‌న్‌లో అంద‌రూ క‌ష్ట‌ప‌డి శ్ర‌మించి స‌ఫ‌లీకృత‌మయ్యారు.ఇదే విషయాన్నీ అధికారులు వెల్ల‌డించారు.

అనంత‌రం చిన్నారిని వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఆస్పత్రికి త‌ర‌లించారు.

తాజా వార్తలు