ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు.. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఓవర్ వేసిన సిరాజ్..!

క్రికెట్ లో అరుదుగా చరిత్రలో నిలిచిపోయే, ఎవరికి సాధ్యం కానీ సరికొత్త రికార్డులు అప్పుడప్పుడు నమోదు అవుతుంటాయి.

ఒకే ఓవర్ లో నాలుగు వికెట్లు తీయడం నిజంగా ఒక అద్భుతమే.

భారత జట్టు స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్( Mohammed Siraj ) ఆ ఘనత సాధించిన తొలి భారత బౌలర్ గా నిలిచాడు.మహమ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్ చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది.

ఒకే ఓవర్ లో ఒక్కో బంతిని ఒక్కోలా వేసి.సరికొత్త వ్యూహంతో బ్యాటర్లను పెవిలియన్ కు చేర్చి శ్రీలంక ఓటమిని శాసించాడు.

ఫైనల్ మ్యాచ్ లో జరిగిన ఈ అద్భుతం ఒక కలలాగా అనిపిస్తుంది.శ్రీలంక జట్టు ( Sri Lanka )ఆసియా కప్ టోర్నీలో లీగ్ మ్యాచ్లు, సూపర్-4 మ్యాచులు ఎంతో అద్భుతంగా ఆడి ఫైనల్ కు చేరి ఇలా ఘోరంగా విఫలం కావడం శ్రీలంకకు మాయని మచ్చలాగా చరిత్రలో నిలిచిపోతుంది.ఈ మ్యాచ్ ను భారత్, శ్రీలంక జట్లు ఎన్నటికీ మరిచిపోలేవు.

Advertisement

ఈ మ్యాచ్ లో రెండో ఓవర్ బౌలింగ్ చేసిన సిరాజ్ మొదటి, మూడు, నాలుగు, ఆరు బంతులకు వికెట్లు పడగొట్టాడు.దీంతో కేవలం రెండు ఓవర్లలోనే శ్రీలంక జట్టు ఐదు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.స్టేడియంలో కూర్చున్న శ్రీలంక జట్టు అభిమానులు ఎంతో నిరాశ చెందారు.

మహమ్మద్ సిరాజ్ ఆఫ్ స్టంప్ ఆవల లెంగ్త్ బంతితో ఓవర్ ను ఆరంభించాడు.నిశాంక ఆ బంతిని కవర్ డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించి జడేజా( Ravindra Jadeja ) చేతికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

ఇక సిరాజ్ మూడో బంతిని తెలివిగా స్వింగ్ చేసి సమరవిక్రమ వికెట్ ను బలి తీసుకున్నాడు.సమర విక్రమ DRS తీసుకున్న ఫలితం దక్కలేదు.

ఆ తర్వాత ఫుల్ బంతితో అసలు అవుట్ చేశాడు.బ్యాటర్ బంతిని కట్ చేయాలని ప్రయత్నించి ఇషాన్ కిషన్ చేతికి క్యాప్ ఇచ్చి అవుతాడు.

శోభన్ బాబు కలర్ గురించి జయలలిత తల్లి అలా అన్నారా.. అసలేం జరిగిందంటే?
ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ ఇండస్ట్రీలో మరొకరు లేరా..? ఆయనకి ఎందుకంత క్రేజ్...

ఈ ఓవర్ లో ఐదవ బంతి ను ధనంజయ డిసల్వా ఫోర్ కొట్టి సిరాజ్ హ్యాట్రిక్ కు బ్రేక్ వేశాడు.సిరాజ్ బౌండరీ ఆపేందుకు బౌండరీ లైన్ వరకు పరిగెత్తడం విశేషం.

Advertisement

ఆ తర్వాత బంతికి ధనంజయ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసి కీపర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.సిరాజ్ వేసిన ఈ ఓవర్ క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోనుంది.

తాజా వార్తలు