ఆ నాలుగు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయంటే...?

ఎగ్జిట్ పోల్స్ హంగామా తెలంగాణలోనే కాదు.మిగతా నాలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే హంగామా కనిపిస్తోంది.తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్, మిజోరాం శాసనసభలకు ఎన్నికలు జరిగాయి.2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను ఈ ఐదు రాష్ట్రాలు ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో…అందరిలోనూ ఆసక్తి నెలకొంది.వీటిలో మూడు రాష్ట్రాల్లో బీజేపీ రూలింగ్‌లో ఉన్నాయి.ముందుగా 200 సీట్లున్న రాజస్థాన్ విషయానికొస్తే.న్యూస్-18 తప్పితే అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కే మెజార్టీ వస్తుంది అనే ఫలితాలను ప్రకటించింది.

 Four States Exit Polls Are Announced-TeluguStop.com

మధ్యప్రదేశ్ శాసనసభ విషయానికి వస్తే.మూడుసార్లు అధికారంలో ఉంది బీజేపీ.ఈసారైనా గ్వాలియర్ కోటలో కాంగ్రెస్ అడుగుపెట్టాలని చూస్తోంది.ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ విషయానికొస్తే.230 సీట్లున్న శాసనసభకు మేజిక్ ఫిగర్ -116.టైమ్స్ నౌ మినహా, రిపబ్లిక్ టీవీ, ఏబీపీ, ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి.90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్‌గఢ్ లో కూడా మూడు సార్లు అధికారంలో వుంది బీజేపీ.రిపబ్లిక్ టీవీ ఒక్కటే ఇక్కడ కాంగ్రెస్ వైపు మొగ్గుతోంది.టైమ్స్ నౌ, ఇండియా టీవీ ఛానెళ్లు బీజేపీకే పట్టం కడుతున్నాయి.

మిజోరంలో వచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం.కాంగ్రెస్‌, మిజో నేషనల్‌ ఫ్రంట్‌కు సరైన ఆధిక్యం వచ్చే అవకాశం లేనట్లు కనిపిస్తోంది.ఇక్కడ కాంగ్రెస్-ఎంఎన్‌ఎఫ్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది.ఇక్కడ ప్రతి రెండు దఫాలకు కాంగ్రెస్‌, మిజో నేషనల్‌ ఫ్రంట్‌ల మధ్య అధికార మార్పిడి జరుగుతూ వస్తోంది.హంగ్‌ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నందున ఇతరుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తోంది.40 అసెంబ్లీ స్థానాలుండగా మెజార్టీ మార్కు 21.ఈ ఎగ్జిట్‌ పోల్స్‌లో బీజేపీ సీట్ల గురించి వెల్లడించలేదు.రిపబ్లిక్‌-సీ వోటర్స్‌ సర్వే.

కాంగ్రెస్‌ 14-18, ఎంఎన్ఎఫ్‌ 16-20, ఇతరులు 3-10 , న్యూస్‌ఎక్స్‌ – నేత.కాంగ్రెస్‌ 15, ఎంఎన్‌ఎఫ్‌ 19, ఇతరులు ౦6.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube