నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు( MP Raghu Rama Krishnam Raju ) ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM YS Jagan ) తో రఘురామ కృష్ణం రాజు కు విభేదాలు ఏర్పడిన దగ్గర నుంచి ఆయన అదే పనిగా వైసిపి ప్రభుత్వాన్ని, జగన్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.
ఏ చిన్న అవకాశం దొరికినా, విమర్శలతో విరుచుకు పడుతున్నారు అంతే కాకుండా ఏపీ ప్రభుత్వం పై అనేక సార్లు కేంద్రానికి ఫిర్యాదు చేశారు.ఒక రకంగా రఘురామ వైసీపీకి తలనొప్పిగానే మారారు.
చాలాకాలంగా ఏపీలో అడుగుపెట్టకుండా ఢిల్లీలోని ఉండిపోయారు.ఇటీవల సంక్రాంతి సమయంలో తన సొంత నియోజకవర్గానికి వచ్చారు ఇదిలా ఉంటే… నిన్న తాడేపల్లిగూడెంలో టిడిపి, జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో రఘురామ జగన్ పైన, వైసిపి ప్రభుత్వం పైన సంచలన విమర్శలు చేశారు.

అలాగే టిడిపి అధినేత చంద్రబాబు( TDP Chandrababu Naidu ), పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తాను టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Pawan Kalyan ) ను అభినందించడానికే వారి ఉమ్మడి సభకు వచ్చానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.తాను ఏ పార్టీలో చేరనప్పటికీ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసమే ఒకటైన టిడిపి, జనసేన సభ( TDP Janasena Jenda Public Meeting )కు హాజరయ్యానని ఆయన తెలిపారు.రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తిని చరిత్ర పుటల్లో కలిపే సమయం వచ్చిందని ఈ సందర్భంగా జగన్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు.
తాను ఏ పార్టీలో చేరకున్నా, వచ్చే ఎన్నికల్లో ఈ కూటమి తరపునే నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని రఘురామ ప్రకటించారు.

త్వరలోనే ప్రజల్లోకి వస్తానని ఆయన తెలిపారు.సిద్ధమా( Siddham ) అని రోడ్డెక్కిన వ్యక్తితో యుద్ధం చేసి ఓడించేందుకు ఈ సభ తొలి అడుగు అని రఘురామ అన్నారు.టిడిపి, జనసేన కూటమి రాష్ట్రంలో చరిత్ర సృష్టిస్తుందని, ఇది ప్రజలు కోరుకున్న పొత్తు అని, ఇరు పార్టీల శ్రేణులు కష్టపడితే వచ్చే ఎన్నికల్లో 160 స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని అన్నారు.