ఆసుపత్రిలో చేరిన అమెరికా మాజీ అధ్యక్షుడు జమ్మీకార్టర్

అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీకార్టర్ అస్వస్థతకు గురయ్యారు.దీంతో కుటుంబసభ్యులు ఆయనను జార్జియాలోని ఆసుపత్రిలో చేర్చారు.

 Former President Jimmy Carter-TeluguStop.com

మూత్ర నాళాలకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ప్లెయిన్స్‌లోని సమ్టర్ మెడికల్ సెంటర్‌లో చేర్చారు.

ఆయన బాగానే ఉన్నారని… త్వరలోనే ఇంటికి తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు కార్టర్ సెంటర్ ఒక ప్రకటనలో తెలిపింది.95 ఏళ్ల కార్టర్ గత వారం అట్లాంటాలోని ఎమోరీ యూనిర్సిటీ హాస్పిటల్‌లో మెదడుకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్నారు.

Telugu Jimmy Carter, Jimmycarter, Telugu Nri Ups-

వయసు మీద పడుతుండటంతో ఆయనను గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి.అందుకు తగ్గట్టుగానే ఈ ఏడాది ప్రారంభంలో కార్టర్ హిప్ రిప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకున్నారు.దీని నుంచి కోలుకున్న వెంటనే అక్టోబర్ 6న జారీపడటంతో ఆయన తలకు గాయమై 14 కుట్లు పడ్డాయి.

గత నెలలో మరోసారి జారిపడటంతో కార్టర్ కటి విరిగి ఆసుప్రతిలో చేరారు.

కాగా 2015లో తాను మెలనోమాతో బాధపడుతున్నానని.

అలాగే క్యాన్సర్ తన శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించిందని ప్రకటించారు.ఇదే సమయంలో కార్టర్ కాలేయాన్ని తొలగించారు.

ఇమ్యునోథెరపీ, రేడియేషన్ చికిత్సలు చేయించుకున్న తర్వాత తనకు క్యాన్సర్ నయమైందని జిమ్మీకార్టర్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube