టీఆర్ఎస్ కు మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ రాజీనామా చేశారు.ఈ మేరకు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ సీఎం కేసీఆర్ కు బూర లేఖ రాశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలపై ఆయన విమర్శలు గుప్పించారు.తెలంగాణ ఉద్యమ కారులకు సరైన ప్రాధాన్యత లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు.
నియోజకవర్గంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనాలకు ఆహ్వానం లేదన్నారు.బీసీలకు టికెట్ అడగటం అన్యాయమా అని ప్రశ్నించారు.
అన్ని తెలిసి మీరు మౌనంగా ఉండటం బాధించిందంటూ వాపోయారు.అందుకే టీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.